బ్లాక్ మెయిలర్ భరతంపట్టేలా బదులిచ్చిన యువతి.. Woman's response to cyber bullying goes viral online

Juhu girl takes blackmailer head on with facebook post

taruna aswani, cyberbully, viral post, facebook, mumbai, new york, hacker harassment, juhu, cyber crime, blackmailer, nude posts, nude videos, FBI, America, trending news, viral news

Taruna Aswani, the woman who stood up to a cyberbully who threatened to make some private videos of her public if she fails to 'excite' him with raunchy video clips of her.

బ్లాక్ మెయిలర్ షాక్.. భరతంపట్టేలా బదులిచ్చిన యువతి..

Posted: 10/25/2016 12:36 PM IST
Juhu girl takes blackmailer head on with facebook post

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్నది నిజం. ప్రతీ చిన్న విషయానికి అందోళన చెందేవారు.. తరున్ అశ్వినీకి ఎదురైన షాకింగ్ ఘటనను ఎదుర్కోంటే భాయందోళనకు గురికాక మానరు. తమ మానాన తమను వదిలేయమని బతిమాలుతూ అందుకు ఎంతో కోంత ధనమో, దస్కమో సమర్పించుకుంటారు. లేక వారికి లోంగిపోతారు. అది కాకపోతే.. పరుపు పోయిందని ప్రాణాలను తృణప్రాయంగా తీసుకుంటారు. అయితే ఈ ఆమ్మాయి ఏం చేసింది. ఎలా బుద్ది చెప్పిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమె ధైర్యాన్ని అభినందిస్తూ ప్రశంసలు కూడా వెల్లివిరుస్తున్నాయి. అంతలా అమె చేసిందేమిటీ.. అంటే వివరాల్లోకి వెళ్లక తప్పదు.

భారత్ దేశం ముంబైలోని జుహూకు చెందిన అమ్మాయి తరుణ అశ్విని.. ప్రస్తుతం అమెరికాలో ఫిజియోధెరఫీ నిఫుణురాలిగా కొనసాగుతుంది. తనకు గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ఓ ఈమెయిల్‌ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. నువ్వు పంపిన వ్యక్తితో పాటు అవి నా వద్ద కూడా వున్నాయి.. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అన్నది ఈమెయిల్ సారాంశం.

ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాడు. అప్పటి వరకు అవి కేవలం బెదిరింపులే అని భావించిన అశ్వనీకి తన ఫోటోలు చూడటంతో కలవరానికి గురిచేసింది. వాడు అన్నంత పనిచేస్తే.. తన పరువుమర్యాదలు ఏం కావాలని..? తన మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. అయితే వాడి బెదిరింపులకు లొంగకూడదని కృతనిశ్చయంతో వున్న అమెకు ఒక్క ఐడియా తట్టింది. అంతే ఐడియా ప్రకారం ముందుకెళ్లింది. అదేంటంటారా..?

తన ఐడియా ప్రకారం బ్లాక్ మెయిలర్ బెదిరింపులను బహిరంగపరచింది. వాడు పంపిన రెండు ఈయిళ్లను స్ర్కీన్‌షాట్స్‌ తీసి ఆమె తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టింది. సైబర్‌ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. పలువురు అమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మరికోందరు మాత్రం.. అలాంటి ఫొటోలు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఆమె ప్రియుడు, పోలాండ్‌ జాతీయుడైన స్టాస్‌ ఈస్ట్‌కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టడంతో అమెకు కొండంత బలం వచ్చిచేరింది. తనకు ఆన్‌లైన్‌ బెదిరింపులు, బ్లాక్ మెయిలర్ ఈ మెయిల్స్ రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు‌, ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదని తరుణ్ అశ్విని తెలిపారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్‌ సెల్‌ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taruna aswani  cyberbully  viral post  facebook  mumbai  FBI  America  

Other Articles