ములాయం ఎదుటే బాబాయ్-అబ్బాయిల డిష్యుం.. డిష్యుం... | Shivpal Yadav grabs mic at meeting calls Akhilesh liar

Shivpal yadav grabs mic at meeting calls akhilesh liar

Akhilesh liar Uncle Shivpal Yadav, Shivpal Yadav mic from Akhilesh Yadav, Akhilesh mic, Shivapal yadav Mic, Shivapal Yadav says Akhilesh Yadav Liar, Akhilesh Yadav Mulayam Singh words war, Akhilesh Yadav liar video

Uncle Shivpal Yadav grabs mic at meeting calls Akhilesh liar infront of Father Mulayam Singh.

ITEMVIDEOS:అఖిలేష్ మాట్లాడుతుండగానే మైక్ లాక్కుని మరీ...

Posted: 10/25/2016 09:58 AM IST
Shivpal yadav grabs mic at meeting calls akhilesh liar

యూపీ సీఎం అఖిలేష్ దూకుడుతో రెండోసారి మంత్రిగా ఉద్వాసన ఎదుర్కున్నాడు అయితేనేం విరుచుకుపడటంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు బాబాయ్ శివపాల్ యాదవ్. ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో విభేదాల నేపథ్యంలో లఖ్‌నవూలో జరిగిన పార్టీ సమావేశంలో తండ్రీ కొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌లిద్దరూ కోపం, భావోద్వేగాలతో ప్రసంగించారు. ఈ సందర్భంగా 61 ఏళ్ల శివపాల్ అఖిలేష్ పై సంచలన ఆరోపణలు చేశాడు.

అమర్ సింగ్ మూలంగానే తమ కుటుంబంలో వ్యవహారం ఇలా తయారయ్యిందని, ఆయన పక్కదోవ పట్టించడం మూలంగానే శివపాల్ మనసులో తనపై వ్యతిరేకత పెరిగిపోయిందంటూ అఖిలేష్ ప్రసగించాడు. అయితే మధ్యలో కల్పించుకున్న శివపాల్ మైక్ లాక్కున్ని అఖిలేష్ అబద్ధాలకోరు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడే ఉన్న కార్యకర్తలంతా ఆ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు. కొందరు మద్ధతుగా నినాదాలు చేయగా, మరికొందరు దానిని ఖండిస్తూ అరవటం విశేషం.

 

ఇక ఈ వ్యాఖ్యల ఈ నేపథ్యంలో పార్టీలో అఖిలేశ్‌కు, బాబాయి శివపాల్‌ యాదవ్‌ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లయ్యింది. సమావేశంలో ములాయం తన సోదరుడు శివపాల్‌ను, సీనియర్‌ నేత అమర్‌ సింగ్‌ను సమర్థించగా, సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒకానోక దశలో పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌లు, అఖిలేష్ లు ఒకరిపై ఒకరు అరుచుకున్నంత పని చేశారు. ఇక అఖిలేశ్‌ మాట్లాడే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని చెప్పారు. అయితే తాను సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయేది లేదని.. వేరే పార్టీ పెట్టే ఆలోచనే లేదని ఉద్వేగంతో చెబుతూ కంట తడి పెట్టుకున్నారు.

శివపాల్‌, అఖిలేశ్‌ల మధ్య వివాదం సద్దుమణిగేలా చేయడానికి ములాయం ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. అఖిలేశ్‌ను సీఎం పదవి నుంచి తొలగించేది లేదని ములాయం స్పష్టంచేశారు.సమావేశంలో అఖిలేశ్‌ తర్వాత శివ్‌పాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇటీవల అఖిలేశ్‌ను కలిసినప్పుడు కొత్తపార్టీ పెట్టనున్నట్లు చెప్పారన్నారు. ఆ పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. ఈ విషయాన్ని అఖిలేశ్‌ స్వయంగా చెప్పారని తెలిపారు. అనంతరం అఖిలేశ్‌యాదవ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై అబద్ధాలకోరు అంటూ చిన్నాన్న మాట్లాడంతో అలిగిన అఖిలేష్ సమావేశాన్ని వీడి ధికారిక నివాసం వైపు వెళ్లిపోయారు. ఆపై తండ్రికొడుకులిద్దరూ ఏకాంతంగా సమావేశమయ్యారని చెప్పుకుంటున్నప్పటికీ, ఆ విషయాలన్నింటిని పార్టీ గోప్యంగా ఉంచుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP CM Akhilesh Yadav  Shivapal yadav  Mic  liar comments  

Other Articles