పవన్ కరెక్ట్ టైమింగ్ తో జగన్ కి పే...ద్ద... తలనొప్పి | Dadi opined that pawan kalyan tough to YS jagan

Dadi opined that pawan kalyan tough to ys jagan

Dadi veerabadra rao Pawan kalyan Jagan, Jagan headache from Pawan, Pawan kalyan vs YS Jagan, Jagan headache with Pawan kalyan, Pawan Kalyan Dadi Veerabadra rao, Janasena vs YSRCP, Jagan troubles with Pawan Timing

Dadi veerabadra rao opined that pawan kalyan tough to YS jagan in 2019 elections.

జగనన్నని ముంచేది వ్యతిరేక ’పవనా‘లేనంట!

Posted: 10/22/2016 04:24 PM IST
Dadi opined that pawan kalyan tough to ys jagan

ప్రతిపక్ష నేతగా జగన్ ఘోరంగా విఫలమవుతున్న తరుణంలో సీనియర్లంతా ఒక్కోక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. ఎన్నికల నాటికి కేడర్ లో కీలక నేతలు దాదాపు సైకిల్ ఎక్కేయటం ఖాయంగానే కనిపిస్తోంది. భూసేకరణ మొదలు మెగా అక్వా ఫుడ్ పార్క్ దాకా ఇలా ఏ అంశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు జగన్. సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతూ జగన్ కి వచ్చే ఎన్నికల నాటికి ఎవరు గట్టి పోటీ ఇవ్వబోతున్నారో కూడా చెప్పేస్తున్నాడు.

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా దాడి చేసే వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ సాయం చేసినా, చేయకపోయినా జగన్ వ్యవహార శైలితో మాత్రం ఆయన సంతృప్తిగా లేడంట. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునే అవకాశాలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయంటూ చెబుతున్నాడు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోలిస్తే జగన్ పరిణితి లేని నేతగా వ్యవహారిస్తున్నాడంటూ వ్యాఖ్యానించాడు. భూసేకరణ దగ్గరి నుంచి అక్వా పార్క్ అంశం దాకా అన్నింట్లోనూ జగన్ కంటే ముందు పవన్ ఉండటమే ఇందుకు కారణం అంటున్నాడు.

కీలక పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో రాజకీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, స్పాంటెనియస్ గా రియాక్ట్ అయి సభలు నిర్వహించి జనాల్లోకి చొచ్చుకుపోయాడు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ప్రభుత్వాలకు వ్యతిరేక గళం విప్పి ప్రజల దృష్టిలో మరో మెట్టు ఎక్కాడు. హోదా విషయంలో అప్పటికే తేలిపోవటం నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పకుండా మాట్లాడం కూడా పవన్ కి బాగా కలిసి వస్తుందని అంటున్నాడు. వెరసి పవన్ రూపంలో దెబ్బ వైఎస్సార్సీపీ కి గట్టిగానే పడబోతుందని దాడి జోతిష్యం చెబుతున్నాడు. కనీసం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు దిగకపోతే 2019 ఎలక్షన్ లో జగన్ కి పవన్ కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dadi Veerabadra Rao  Pawan Kalyan  Janasena  Versus  YS Jagan  YSRCP  

Other Articles