పాక్ మరోకరిని బలి తీసుకుంది | Border Security Force Head Constable died In Pak Firing

Border security force head constable died in pak firing

BSF Head Constable Susheel Kumar died, RS Pura Pak attack BSF died, BSF constable died in Pak fire,

Border Security Force Head Constable Susheel Kumar died In Pakistan Firing at RS Pura.

పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

Posted: 10/24/2016 08:43 AM IST
Border security force head constable died in pak firing

పాకిస్థాన్ చేస్తున్న వరుస దాడులతో సరిహద్దులో సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఓవైపు ఆర్మీ ధీటుగానే సమాధానం చెబుతున్నప్పటికీ, పాక్ కవ్వింపుచర్యల్లో వెనక్కి మాత్రం తగ్గటం లేదు. యూరీ దాడి తర్వాత ఈ ఉల్లంఘన మరీ అలవాటుగా మారింది. సరిహద్దు ప్రాంతాలైన కతువా, సాంబా, ఫూంచ్ మరియు రాజౌరీ జిల్లాలో వీరి కదలికలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్‌లో ఆదివారం రాత్రి నుంచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అఖ్నూర్ సెక్టార్‌లో యథేచ్ఛగా కాల్పులు జరుపుతోంది. 20 బీఎస్ఎఫ్, 5 ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు ఆగకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ అమరుడయ్యాడు. మరో బీఎస్ఎఫ్ జవాను, ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అప్రమత్తమైన భారత దళాలు పాక్‌కు దీటుగా బదులిస్తున్నాయని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి సరిహద్దులోని గ్రామాలను టార్గెట్ చేస్తూ పాక్ రేంజర్లు దాడికి తెగబడగా, ఒక ఉగ్రవాదితో సహా వారందరినీ భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్ గుమామ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచాడు. జవాన్లకు మెరుగైన వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అతని సోదరి గుర్జీత్ కౌర్ శనివారం ఆరోపించిన కొద్ది గంటలకే అతను తుది శ్వాస విడిచాడు. ఇక ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడగా, అతని దగ్గర సిమ్ కార్డులు, మ్యాపులు లభించాయి. ప్రస్తుతం అతన్ని రహాస్య ప్రదేశంలో సైన్యం విచారణ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSF  Head Constable Susheel Kumar  RS Pura Pak Fire  

Other Articles