కరా’ఛీ‘ బేకరీని టార్గెట్ చేసిన నెట్ జనులు.. ఇంకా.. Hypernationalism feeds humour on social media, netzens target karachi bakery

Hypernationalism feeds humour on social media netzens target karachi bakery

Indian onliners, netzens, pakistan, ban on pakistan products, ban on china products, Mysore Pak, Karachi bakery, bombay bakery, pakistan hyderabad, Halwa, Lahori Namak, Multani Mitti, Sindhi Kadhi, Peshawari Biryani, humour, social media

Indians netzens are demanding boycotts pakistan and its cities named items, such as Mysore Pak, Karachi Halwa, Lahori Namak, Multani Mitti, Sindhi Kadhi and Peshawari Biryani which feeds humour on social media

కరా’ఛీ‘ బేకరీని టార్గెట్ చేసిన నెట్ జనులు.. ఇంకా..

Posted: 10/22/2016 10:59 AM IST
Hypernationalism feeds humour on social media netzens target karachi bakery

భారతీయ నెట్ జనులు సోషల్ మీడియా అనుసంధానంగా అసక్తికరమైన చర్చకు తెరలేపారు. ఈ చర్చ అర్థాలు, వాస్తవాలు తెలిసని వారికి నవ్వులు తెప్పిస్తుండగా, నెట్ జనుల వాదనలను గుడ్డిగా నమ్ముతూ.. అనేక మంది చర్చోపచర్చలకు తమ అకౌంట్ల ద్వారా వేదికకు తావిస్తుండడంతో ఇప్పడది కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ లక్షలాధి మందితో సంచలనంగా మారిన చర్చ ఏమిటంటారా..  పాకిస్థాన్, చైనా వస్తువులను నిషేధించాలని పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మన పదాలకు కూడా వారిలో చేరచి నిషేధించాలని డిమాండ్ చేయడమే హాస్యాని పండిస్తుంది.

19 మంది భారత్ సైనికుల వీర మరణానికి కారణమైన ఉరి ఘటన తరువాత, ధాయాది దేశాలైన భారత్-పాక్‌ మధ్య సాంస్కృతిక, వాణిజ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో సామాజిక వెబ్‌సైట్లలో ఈ తరహా సరదా కామెంట్లు పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్, చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ వెల్లువెత్తుతున్న తరుణంలో.. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ పేరుతో కానీ పాకిస్థాన్ కు చెందిన పట్టణాలు, నగరాల పేరుతో కానీ ఏ వస్తువున్నా వాటిని నిషేధించాలన్న డిమాండ్ తో కామెంట్లు ట్రెండ్ అవ్వడం.. నెట్ జనులకు హాస్యాన్ని పంచుతున్నాయి.

ఆ జాబితాలో ముందుగా నిలిచింది మైసూర్‌ పాక్‌'.. మైసూర్ పాక్ ను మైసూర్ ఇండియాగా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. మైసూర్‌ పాక్ ను మైసూర్ ఇండియా అని పేరు మార్చేవరకు తినకండి, దాన్ని బహిష్కరించండి! అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. అయితే మైసూర్ పాటక్ కృస్ణ రాజా వడియార్ నాల్గవ రాజు హాయాంలో దీనిని తయారు చేశారు. అందుకని మైసూరులో తయారైంది కాబట్టి మైసూర్ పేరు పెట్టారు. నూనె లోంచి తీసిన తరువాత చక్కర పాకంలో పెట్టి ఆ తరువాత నేతిలో ముంచారు కాబట్టి పాకం అని అర్థం వచ్చేట్లు పాక్ అని కన్నడ పదం చివరి అతికింది.. మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. అయితే దీనిని మైసూర్ పాక్ అనగానే పాకిస్థాన్ నుంచి వచ్చిన వంటకం అని భావించి నెట్ జనులు చేసిన కామెంట్లు నవ్వులు తెప్పిస్తున్నాయి.

ఇక భారత్ లోని కరాచీ బేకరీల్లోని స్వీట్లను కూడా నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతుంది. అయితే పాకిస్థాన్ లోని హైదరాబాద్ నగరంలో గత కోన్నేళ్లుగా నడుస్తున్న ముంబాయి మేకరి మాటేమిటన్నది ఎవరు చెప్పడం లేదు. ఇక ఇలా ఒక్కటని కాదు.. బేకరీల్లో దొరికే కరాచీ బిస్కట్లను, కరాచీ హల్వా, పెషావరీ బిర్యానీ, లాహోరీ నమక్, ముల్తానీ మిట్టీ,  సింధీ కఢీ (గ్రేవీ డిష్‌) లను బహిష్కరించండి... పక్వాన్‌ (వంటకాలు) అనే పేరును కూడా ఇంద్వాన్ అని మార్చండి...'' అని డిమాండ్ ను నెట్ జనులు తెరపైకి తీసుకువస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  china  mysore pak  karachi bakery  

Other Articles