లైంగిక ఆరోపణలు వర్సెస్ వలస విధానాలు | Final Presidential Debate for US elections over

Final presidential debate for us elections over

Final US Election debate before America votes, Trump vs Hillary, Hillary vs Trump, Final Debate between Clinton and Trump, Trump Clinton, three debates who win, US election debate

Final US Election debate before America votes over, Hillary vs Trump debate.

ఫైనల్ డిబేట్ లో పైచేయి ఎవరిదంటే...

Posted: 10/20/2016 08:24 AM IST
Final presidential debate for us elections over

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తుది అంకంకు చేరుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లాస్ వెగాస్ లో నెవెడా యూనివర్సిటీలో నిర్వహించిన చివరి డిబెట్ బాగానే విమర్శలు చేసుకున్నారు. తొలి రెండు రౌండ్లలో పై చేయి సాధించిన హిల్లరీ మూడో దాంట్లోనూ సమర్థవంతంగా ట్రంప్ ని ఎదుర్కుంది. జాతి వివక్ష, లైంగిక ఆరోపణలపై ట్రంప్ ను హిల్లరీ కడిగి పడేస్తే, హ్యాకింగ్, వలసల గురించి ట్రంప్ హిల్లరీని ఏకీపడేశాడు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో ఒక్కోసారి ఇద్దరూ కూడా కాస్త అసహనానికి లోనైయ్యారు. ట్రంప్ స్పీచ్ ను పరిశీలిస్తే... అసలు ఐసిస్ ను అమెరికా రుద్దింది హిల్లరీయే. ఒబామా చాలా మందిని దేశం నుంచి పంపించేశాడు. దాని గురించి హిల్లరీ ఎందుకు మాట్లాడరు. నేనే గనక అధ్యక్షుడినైతే చట్టాల్లో మార్పులు తెస్తా . జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం ఎందుకు మద్దతుగా నిలవాలి అంటూ ప్రశ్నలు కురిపించాడు.

అమెరికా రక్షణ ఒప్పందాలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచ దేశాలతో, ప్రధానంగా దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా దేశాలతో గతంలో కుదర్చుకున్న రక్షణ ఒప్పందాలను సమీక్షిస్తానని అన్నాడు. ఆ దేశాలు భరించాల్సిన భారాన్ని సైనిక శక్తిని మోహరించడం ద్వారా అమెరికానే భరిస్తోందని, మనకు అసలు అంత అవసరం ఉందా అంటూ ట్రంప్ నిలదీశాడు. ఇక జీడీపీ విషయంలో కూడా అమెరికా దారుణంగా వెనుక బడి పోయిందని, భారత్ లాంటి దేశాలు ఈ విషయంలో ముందుకు వెళ్తున్నాయంటూ చెప్పుకోచ్చాడు. జీడీపీలో భారత్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తూ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, అదే బాటలోనే చైనా 6 శాతం జీడీపీ వృద్ధితో దూసుకుపోతోందని అన్నాడు.

‘‘ అమెరికా ఎన్నికలలో రిగ్గింగ్.. ట్రంప్ వ్యాఖ్యలకు బలం..’’

మరి అదే సమయంలో అమెరికా మాత్రం కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ శాతం జీడీపీ వృద్ధిరేటుతో వెనకబడిపోయిందని ట్రంప్ ఆరోపించారు. ఇలాగే అమెరికా విధానాలు కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుందని, ఇలాంటి విధానాలు సరికాదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా జీడీపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన అన్నారు. రష్యాతో సంబంధాల గురించి మాట్లాడుతూ పుతిన్ ను తాను ఇంతవరకు కలవలేదని చెబుతూ, భవిష్యత్తులో అగ్ర రాజ్యాలు అయిన అమెరికా, రష్యాలు అణ్వాయుధ దేశాలుగా కలిసి నడవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇక రెండవ రాజ్యాంగ సవరణకు మద్ధతు తెలుపుతూ తన స్పీచ్ కొనసాగించిన హిల్లరీ ట్రంప్ ఆరోపణలకు ధీటుగానే స్పందించింది. మన దేశం వెనక బడింది. చైనా వస్తువులు వద్దని అంటున్నారు. కానీ, లాస్ వెగాస్ లో చైనా స్టీల్ లో హోటల్ కట్టాడు. జాతి వివక్ష, లైంగిక వేధింపులు ట్రంప్ పై ఉన్నాయంటూ అందుకుంది. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం మద్దతుగా నిలవాల్సిందేనంటూ తెలిపిన హిల్లరీ, అమెరికా అగ్రదేశంగా, ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలవాలంటే మిత్రదేశాలకు అండగా నిలవాల్సిందేనని గట్టి కౌంటరే ఇచ్చారు. మిత్రదేశాల సహాయసహాకారాలు తీసుకోవడమే కాకుండా, ఆయా దేశాలకు అండగా నిలవడం ద్వారా అమెరికా తన స్థాయిని నిలబెట్టుకుటుందని ఆమె అన్నారు. ఇక రష్యా సైబర్ దాడులు చేస్తూంటే వారితో మైత్రి గురించి ట్రంప్ ఇప్పటి నుంచే మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. 

అంతర్జాతీయ సంబంధాలను విశాల దృక్పధంతో చూడాలని ఆమె సూచించారు. అమెరికా ఎప్పుడూ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని భావిస్తుందని అందులో భాగంగా జపాన్, కొరియా, యూరోపియన్, మిడిల్ ఈస్ట్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. జీడీపీ పై సమాధానంగా హిల్లరీ మాట్లాడుతూ... చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటున్నారు. మరోవైపు చైనా వస్తువులను బ్యాన్ చేయాలని కూడా ఆయనే అంటున్నారు. మరి చైనా నుంచి అవసరాలకు మించి ఇనుము, అల్యూమినియం తెచ్చుకుని ఇక్కడ లాస్ వెగాస్ లోనే హోటల్ నిర్మించిన చరిత్ర ట్రంప్ ది కాదా? అంటూ ప్రశ్నలు కురిపించారు. అదే సమయంలో ట్రంప్ కంపెనీల్లో చైనా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ట్రంప్ కంపెనీల్లో అమెరికన్ల కంటే చైనీయులే ఎక్కువ మంది పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని గగ్గోలు పెట్టే బదులు మందు ట్రంప్ కంపెనీల్లో అమెరికన్లకు ఉపాధి కల్పించాలని సూచించారు. విద్యావిధానాలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసి, జీడీపీలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి వాడీ వేడిగా పేల్చుకున్న మాటల తుటాలకు అఫీషియల్ గా నేటితో తెరపడిందనే అనుకోవాలి. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Final Debate  US elections  Clinton vs Trump  

Other Articles