దెయ్యాలు ఫోన్లు మాట్లుకుంటాయా? గాల్లో సెక్స్ చేస్తాయా? | Spooked tenant cries attack from evil spirit

Spooked tenant cries attack from evil spirit

Spooked tenant cries attack from evil spirit, Indore writer harassed, Indore writer harassed by Ghost, Ghost harassed, Ghost phone calls, Ghost Air Sex, Chandra Prakash Trivedi Ghost

Spooked tenant cries attack from evil spirit, Indore writer harassed by Ghost for Sex.

ఈ దెయ్యాల గోల ఏంట్రా బాబోయ్...

Posted: 10/20/2016 07:53 AM IST
Spooked tenant cries attack from evil spirit

గొలుసు పోయింది, పర్సు పోయింది అంటూ పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైయింట్ తీసుకునే పోలీసులకు, దెయ్యాల మీద ఫిర్యాదు అందింతే ఎలా ఉంటుంది. వాటి వల్ల తన మనశ్శాంతి పోయిందంటే ఇంకేలా ఉంటుంది. గ్వాలియర్ పోలీసులకు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అసలు దెయ్యాలున్నాయా? అన్న ధర్మసందేహాన్ని పక్కనబెట్టి ఇది చదవండి.

మధ్యప్రదేశ్ లో గ్వాలియర్‌ కి చెందిన 40 ఏళ్ల మమత అనే మహిళ తన ఇంట్లో దెయ్యాల గోల భరించలేకపోతున్నానంటూ ఖాకీలను ఆశ్రయించింది. తమ ఆస్తిపై కన్నేసిన ఇంటి ఓనర్ తమ ఇంట్లోకి దయ్యాలను ఉసిగొల్పుతున్నాడని అందులో పేర్కొంది. అంతేకాదు అలా వదిలిన దయ్యాలు తమ ఇంట్లో ఫోన్లలో మాట్లాడుకుంటున్నాయని, టీవీ చూస్తున్నప్పుడు తెరపై కనిపించే మనుషులు ఉన్నట్టుండి కళ్ల ముందు ప్రత్యక్షమై దయ్యాలుగా మారిపోతున్నారని పేర్కొంది.

ఆమె బాధను ఓపికగా విన్న గ్వాలియర్‌ డీఎస్పీ ఆలం ఖాన్‌ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చి పంపించారు. ఆపై సైబర్ బ్రాంచ్ కు ఈ విషయంపై సమాచారం అందించి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించాడు. ఇక ఇలాంటి మరో ఘటన ఇండోర్ లో కూడా చోటు చేసుకోవటం విశేషం. తనను ఓ ఆడ దెయ్యం వేధిస్తుందంటూ రచయిత అయిన ప్రొఫెసర్ చంద్ర ప్రకాశ్ త్రివేది(66) పోలీసులను ఆశ్రయించాడు. వేద శాస్త్రాల మీద 10 పుస్తకాలు రాసిన ఆయనను ఆ దెయ్యం రాత్రి సమయంలో గాల్లోకి లేపుతూ తనతో శృంగారంలో పాల్గొనాలని వేధిస్తుందంట. ఈ విషయం ఎవరూ నమ్మటం లేదంటూ ఆయన పోలీసుల ముందు వాపోతున్నాడు. మరి పోలీసులు ఆ దెయ్యాల భరతం ఎలా పడతారో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghost harassment  Spooked tenant cries  Gh  

Other Articles