ఔనా..! బృందా కారత్ వ్యాఖ్యలు నిజమేనా..? goonda sarkar in andhra pradesh, alleges cpm leader brinda karat

Goonda sarkar in andhra pradesh alleges cpm leader brinda karat

cpm polit bureau member brinda karat, ap cm chandra babu, cpm, brinda karat, andhra pradesh, goonda sarkar, TDP, chandrababu, Telugu desam party, nara lokesh, able adminstrator

cpm polit bureau member brinda karat alleges that people of andhra pradesh are suppresed under goonda sarkar

టీడీపీ సర్కారుపై బృందా కారత్ ఘాటు వ్యాఖ్యలు నిజమేనా..?

Posted: 10/14/2016 09:03 AM IST
Goonda sarkar in andhra pradesh alleges cpm leader brinda karat

నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలను గుండా సర్కార్ పాలిస్తుందని, ప్రభుత్వ తీరుకు నిరసనలు తెలిపుతున్న ప్రజలపైన పోలీసుల లాఠీలు, తుపాకీ గుళ్లను ప్రయోగించే అణిచివేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ ధ్వజమెత్తారు. నవ్యాంధ్రలో రాజ్యమేలుతున్న గుండారాజ్యంపై తక్షణం ప్రజలు ఉద్యమించాలని అమె పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని ఇస్తే అదికారాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపైనే కత్తిగట్టిందన్ని అమె అరోపించారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిర్మించడాన్ని నిరసిస్తూ.. భీమవరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను ఉల్లంఘిస్తూ ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.  

ఫుడ్‌పార్క్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆధైర్యంతో కన్నీరు పెట్టుకోకుండా, ప్రభుత్వంపై పోరాడి చంద్రబాబుకు కంటనీరు తెప్పించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ అంటూ ప్రచారం చే స్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles