ఇండో-పాక్ బార్డర్ పై కేంద్రం సంచలన నిర్ణయం Will seal Indo-Pak border by December 2018 says Rajnath Singh

Will seal indo pak border by december 2018 says rajnath singh

surgical strikes, rajnath singh, india pakistan, indo pak border seal, india pakistan border, Border Security Grid, kireon rijiju

When asked about Congress vice-president Rahul Gandhi's 'Dalali' remark for PM Modi in relation to the surgical strikes, Singh declined to comment.

ఇండో-పాక్ బార్డర్ పై కేంద్రం సంచలన నిర్ణయం

Posted: 10/07/2016 02:11 PM IST
Will seal indo pak border by december 2018 says rajnath singh

భారత్-పాకిస్థాన్ సరిహద్దు అంశంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చేస్తున్న కుయుక్తులను. కుట్రలను, సరిహద్దుల కాల్పుల విరమణ ఉల్లంఘన విషయాలను అనునిత్యం ప్రపంచ దేశాల దృష్టికి, ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి.. అందరిలో పాకిస్థాన్ ను ఒంటరి చేయాలన్న భారత్ వ్యూహాలు ఫలించాయి. కాశ్మీర్ అంశంలో భారత్ పాకిస్థాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇన్నాళ్లు వాదించిన ప్రపంచ దేశాలు తాజాగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కు మద్దతిచ్చాయి. ఇక ఈ సరిహద్దు అంశంలో మరింతగా వివిదాస్పదం కానీయకుండా అక్రమ చోరబాట్లకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది.

ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ సరిహద్దును 2018, డిసెంబర్ వరకు పూర్తిగా మూసివేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ సమయంలో సరిహద్దులో పరిస్థితిని కనిపెట్టి చూస్తామని పేర్కొన్నారు. బోర్డర్ సెక్యురిటీ గ్రిడ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దీని ద్వారా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటామన్నారు.

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో శుక్రవారం సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... దేశభద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. సైన్యం పట్ట పూర్తి విశ్వసనీయత చూపాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles