ఈడెన్ పిచ్ నమ్మకాన్ని నిలిపింది: గంగూలీ Ganguly credits coach and captain for including Bhuvneshwar in Eden Test

Ganguly credits anil kumble and virat kohli for including bhuvneshwar kumar for eden test

Bhuvneshwar Kumar, India-New Zealand, Sourav Ganguly, Anil Kumble, Virat Kohli, cricket, cab president, sports, sports news

Former Indian skipper Sourav Gangly has credited the captain Kohli and coach Kumble for including Bhuvi in the playing XI for this crucial Test.

భువిని జట్టులోకి తీసుకున్నందుకు కుంబ్లే, కోహ్లీలకు గంగూలీ కితాబు

Posted: 10/01/2016 09:15 PM IST
Ganguly credits anil kumble and virat kohli for including bhuvneshwar kumar for eden test

న్యూజిలాండ్ తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ స్డేడియంలో జరగుతున్న రెండో టెస్టులో భారత జట్టులోకి పేసర్ భువనేశ్వర్ కుమార్ ను తీసుకోవడం కలిసొచ్చిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భువీకి అవకాశం కల్పించిన టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభినందించాడు. భువనేశ్వర్ ఈడెన్ లో తన పేరును లిఖించుకున్నాడని కొనాయాడారు. గత మూడేళ్లలో ఇక్కడ ఐదు వికెట్ల ఇన్నింగ్స్(5/33) ఫీట్ నమోదు చేసిన తొలి భారత పేసర్ భువీ అని కొనియాడాడు.

నాగ్ పూర్ టెస్టు తర్వాత కోల్ కతాలో పేసర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చేసిన సూచనలు బాగా పనికిరావడంపై హర్షం వ్యక్తంచేశాడు. పిచ్ పై పచ్చిక ఉన్నప్పుడు పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు సందిస్తే భువీ తరహాలోనే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈడెన్ టెస్టు రెండు రోజుల్లో భువీ అందరికంటే ప్రత్యేకమన్నాడు. ఇటీవల కరీబియన్ లో వెస్డిండీస్ తో టెస్టు సిరీస్ లోనూ తొలి రెండు టెస్టుల్లోనూ భువనేశ్వర్ కు అవకాశమివ్వలేదు.

అనూహ్యంగా మూడో టెస్టులో చోటు దక్కించుకున్న భువీ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుత సిరీస్ లో కివీస్ తో తొలి టెస్టులో అవకాశం రాకున్నా బాధపడలేదు.. ఎంతో నిబద్ధతతో రెండో టెస్టులో తానేంటో భువీ నిరూపించుకున్నాడని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూలీ చెప్పుకొచ్చాడు. భువీ దాటికి రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 34 ఓవర్లాడిన కివీస్ 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  new zealand  Bhuvneshwar Kumar  Sourav Ganguly  cricket  cab president  

Other Articles