పాక్ మీడియా పిచ్చ కథనాలు ఎంత దిగజారి అంటే... | pak media false news as 14 Indian soldiers killed one captured alive

Pak media false news as 14 indian soldiers killed one captured alive

Pak media on Indian Surgical strikes, Pakistan army killed 14 Indian soldiers, 14 Indian soldiers killed in Pak attack, Pak fake news on Indian attack, Indian Surgical strikes video, Indian Army attack pak video, Pak media false news, Chandu Babulal Chauhan, Chandu Babulal Chauhan captured by Pak

Pakistan media false news as 14 Indian soldiers killed one captured alive in retaliatory action.

పాక్ పిచ్చ ఎంత పీక్స్ లో ఉందంటే...

Posted: 09/30/2016 08:28 AM IST
Pak media false news as 14 indian soldiers killed one captured alive

పాకిస్థాన్ శిబిరాలపై, జీహాదీలపై, ముజాహిదీన్లపై దాడి చేసి వారిని మట్టుబెట్టినట్లుగా హిందీ సినిమాల్లో మాత్రమే చూపిస్తారని, అవి ఆచరణ సాధ్యం కాదంటూ హేళన చేస్తూ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ వ్యాఖ్యలు చేసి పదిరోజులు కాకముందే భారత్ దెబ్బ ఎలా ఉంటుందో రుచిచూపించింది. అయితే భారత్ మెరుపు దాడులతో ఫీజులు ఎగిరిపోయిన పాక్ ఇప్పుడు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో పడింది. మీడియాలో తప్పుడు కథనాలతో తమ దేశ పౌరులను మభ్యపెట్టడమే కాకుండా భారత సైనికులపైనా పైచేయి సాధించాలని చూస్తోంది.

‘భారత సైన్యం నియంత్రణ రేఖను ఉల్లంఘించి మా భూభాగంలోకి వచ్చింది. మా సైన్యం కూడా దీనికి తగిన సమాధానం చెబుతుంది’ అంటూ నిన్న మధ్యాహ్నాం పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే మాట మార్చింది. భారత్ చేసిన సర్జికల్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మాత్రమే మరణించారని, 9 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే, పాక్ సైన్యం స్పందన మాత్రం భిన్నంగా వుంది. అసలు ఇటువంటి దాడులే జరగలేదని ప్రకటించింది.

ఇక రాత్రికి రాత్రి మరో ప్రకటన వెలువరిస్తూ... నియంత్రణ రేఖ వద్ద తాము 14 మంది భారత సైనికులను మట్టుబెట్టినట్టు పాక్ మీడియా కల్పిత వార్తలు ప్రచురించింది. పాక్ సైన్యాన్ని ఉటంకిస్తూ రాసిన ఈ వార్తల్లో 14 మంది భారత సైనికులను పాక్ దళాలు హతమార్చాయని, చందుబాబులాల్ చౌహాన్(22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. అయితే జియో న్యూస్ అనే చానెల్ 14 మంది భారత సైనికులు అని పేర్కొనగా, మరో ప్రముఖ పత్రిక ‘డాన్’ మాత్రం 8 మంది అని పేర్కొనడం గమనార్హం. ఇక పాక్ అధికారిక సైనిక్ వెబ్‌సైట్‌లో మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం విశేషం.

పాక్ మీడియా కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. భారత్ తనన ఖండనను ప్రకటించిన కాసేపటికే డాన్ పత్రిక తన వెబ్‌సైట్ నుంచి భారత సైనికులను హతమార్చిన కథనాన్ని ఉపసంహరించుకుంది. కాగా చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాడి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని పేర్కొంది. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Surgical Strikes  Pakistan  Chandu Babulal Chauhan  

Other Articles