హైదరాబాద్ కాలేజీలో ఉగ్రవాదులకు శిక్షణ... లెక్చరర్ ఫేస్ బుక్ పోస్టులు... మిస్టరీ డెత్ | Lecturer dies After online post on threat from IS in Hyderabad

Lecturer dies after online post on threat from is in hyderabad

Lecturer dies After online post, Lecturer online post on threat from IS in Hyderabad, ISIS in Hyderabad again, Lecturer warns in FB about IS attacks, IS attacks in Hyderabad, Hyderabad attacks FB warns, Facebook ISIS, ISIS in Hyderabad College, Hyderabad College Training

After online post on threat from IS, lecturer dies in suspicious road mishap in Warangal.

హైదరాబాద్ లెక్చరర్ పోస్టులతో ‘ఉగ్ర’ కలకలం

Posted: 09/30/2016 08:47 AM IST
Lecturer dies after online post on threat from is in hyderabad

ఓవైపు సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఓ వార్తతో భాగ్యనగర వాసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాదులోని ఓ కాలేజీలో ఐఎస్ఐఎస్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయన్న వార్త కలకలమే రేపింది. అదే కళాశాలలో పని చేస్తున్న ఓ లెక్చరర్ చనిపోయే సమయంలో దీనికి సంబంధించి 'సేవ్ కంట్రీ' అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ తన ఫేస్ బుక్ లో పోస్లులు పెట్టడంతో వ్యవహారం అంతా బయటికి వచ్చింది.

మెదక్ జిల్లా బండారుపల్లి మండలం తొగుటకు చెందిన ప్రవీణ్‌కుమార్ (28) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఇక్కడి అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎంఎస్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని, అడ్డు చెప్పినందుకు ఉగ్రవాదులు, కళాశాల యాజమాన్యం తనను బెదిరించారని తన ఫేస్ బుక్ లో పోస్టుల్లో పేర్కొన్నారు. వారు కాలేజీ యాజమాన్య సాయంతో గతేడాది తనను హత్య చేయడానికి కూడా కుట్రపన్నారని అందులో పేర్కొన్నాడు. బుధవారం తెల్లవారుజామున 4.41 గంటల నుంచి 5.53 గంటల మధ్య ఆ పేజీలో దాదాపు 30 పోస్టులు పెట్టారు. ఆయన తన పేరు మీదే ఫేస్‌బుక్‌లో ఓ పేజీని నిర్వహిస్తున్నారు.

ఇది జరిగిన కొద్ది గంటల్లోనే వరంగల్ జిల్లా కేంద్రం లోని ఎంజీఎం సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ మరణించారు. ప్రవీణ్ స్నేహితులుగా చెప్పుకొంటున్న కొందరు.. ఆయన ఫేస్‌బుక్ పోస్టులను, ప్రమాదంలో మరణించడాన్ని పేర్కొంటూ ‘అలర్ట్’ పేరిట ఓ సందేశాన్ని తయారుచేశారు. ప్రవీణ్ మరణంపై లోతుగా విచారణ జరగాలంటూ.. వాట్సాప్, ట్వీటర్‌ల ద్వారా పలువురికి సందేశం పంపారు. ఇది మీడియాకు చేరడంతో కలకలం రేగింది.

అయితే ప్రవీణ్ మృతిపై ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొనడంతో మరణించినట్లు అందులో పేర్కొన్నారు. అదే సమయంలో గురువారం సాయంత్రం నుంచి సోషల్ మీడియా పోస్టుల సమాచారం అందడంతో ‘ఉగ్ర’కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఉగ్ర కుట్రలు భగ్నం చేయడమే కాకండా... పెద్ద ఎత్తున్న స్లీపర్ సెల్స్ ను నగరంలో ఎన్ఐఏ పట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్‌ను ఎవరైనా కావాలని చంపారా అనేది తేల్చేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.కాలేజీ యాజమాన్యం మాత్రం అంతా ఉత్తదేనని కొట్టిపారేస్తోంది.

Praveen Kumar Lecturer Post

ప్రవీణ్ ఫేస్ బుక్ పోస్టులు...

దేశాన్ని కాపాడండి (4.41 గంటలకు), ఉగ్రవాదం నుంచి నా ప్రాణాలకు హాని ఉంది (4.43 గంటలకు), గతేడాది ఐఎస్ ఏజెంట్స్‌తో కలిసి నన్ను చంపేందుకు కొందరు ప్రయత్నించారు (4.44 గంటలకు) ఎంఎస్ కాలేజీలో హిందువులను వేధిస్తున్నారు (4.46 గంటలకు), భారత్‌ను పాక్ నుంచి కాపాడండి (5.03 గంటలకు), ఈ విషయాలను కొట్టిపారేయకండి (5.10 గంటలకు), నేను సంస్థ గురించే మాట్లాడుతున్నాను వర్గం గురించి కాదు (5.11 గంటలకు) ఇలా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lecturer  Hyderabad  ISIS  Terrorists  Training  suspicious death  

Other Articles