పాంచ్ సౌ కా పటాకా... గ్రాండ్ విక్టరీ | Team India victory in 500 test against New Zealand

Team india victory in 500 test against new zealand

India 500 Test, kanpur Test Victory, Team India 500 Test, India 197 runs Victory, 500 Test Victory, Team India 500 Test, Ashwin and jadeja 500 test victory, Jadeja and Ashwin for India 500 test, Team India Grand Victory in 500 Test

Team India 197 runs grand victory in 500 test against New Zealand.

టీమిండియా చారిత్రక టెస్ట్ ఘన విజయం

Posted: 09/26/2016 01:18 PM IST
Team india victory in 500 test against new zealand

కాన్పూర్ వేదికగా కొనసాగుతున్న చారిత్రక 500వ టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఆరు వికెట్లతో అశ్విన్ దూకుడు చూపించడంతో కివీస్ 236 పరుగులకు అలౌట్ అయ్యి భారత్ కు అపూర్వ విక్టరీని అందించింది. భారత్ నిర్దేశించిన 434 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా, న్యూజిలాండ్‌పై 197 ప‌రుగుల భారీ తేడాతో టీమిండియా గెలిచింది.

ఆఖరి రోజు ఆటలో గెలిచే అవకాశాలు నామమాత్రంగా ఉన్న వేళ, కనీసం జిడ్డు ఆట ఆడుతూ డ్రాతో గట్టెక్కాలని చూస్తున్న న్యూజిలాండ్ కు జడేజా షాకిచ్చాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రోంచీని పెవీలియన్ దారి పట్టించాడు. ఆపై 194 పరుగుల వద్ద వాట్లింగ్, 196 పరుగుల వద్ద క్రెయిగ్ లు పెవీలియన్ చేరారు. వీరిద్దరి వికెట్లనూ మహమ్మద్ షమీ రెండు వరుస బంతుల్లో తీయడం గమనార్హం. 68వ ఓవర్ ఆఖరిబంతికి వాట్లింగ్ ను బోల్తా కొట్టించిన షమీ, 70వ ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయినట్లయింది. ఇక చివర్లో అశ్విన్ మాయాజాలంతో టీమిండియా ఖాతాలో విజయం వచ్చి చేరింది.

తొలి ఇన్నింగ్స్‌లో 318, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 377 పరుగులు సాధించిన టీమిండియా, కివీస్ ను 262, 236 పరుగులకు కట్టడి చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మ‌రో ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌లో ప‌ది వికెట్ల ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీయ‌డం అత‌నికిది ఐదోసారి. కాగా, ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్ పై 19వ విజయం. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల పేటీఎం సిరీస్ లో టీమిండియాకు 1-0 ఆధిక్యం ల‌భించడమే కాకుండా ప్రతిష్టాత్మక విజయం సొంతమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  500 Test  Kanpur  Victory  197 runs  New Zealand  

Other Articles