రూపాయే కదా నొక్కేసినందుకు చుక్కలు కనిపించాయి | Bangalore Man sued on hotel for charging 1 rupee extra in bill

Bangalore man sued on hotel for charging 1 rupee extra in bill

Bangalore lawyer sued on a hotel for charging 1 rupee, Bangalore lawyer sued on hotel, One Rupee extra chage troubles,

Bangalore lawyer sued on a hotel for charging 1 rupee extra in plate Idly bill.

కంటి మీద కునుకులేకుండా చేసిన ఒక్క రూపాయి

Posted: 09/26/2016 12:51 PM IST
Bangalore man sued on hotel for charging 1 rupee extra in bill

రూపాయి మరోసారి దాని గొప్పతనం నిరూపించుకుంది. హా... ఒక్క రూపాయి కదా. నొక్కేస్తే పోయేది ఏముంది? అని జేబులో పాపానికి ఏళ్లుగా అతనికి కంటి మీద కునుకు కరువైంది. అన్యాయంగా రూపాయి ఎక్స్ ట్రా వసూలు చేశారంటూ ఓ వ్యక్తి కేసు వేయగా, బెంగళూర్ కి చెందిన ఓ హోటల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో వాసుదేవ్ అడిగ అనే వ్యక్తికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హోటల్‌లో నర్సింహమూర్తి అనే న్యాయవాది ప్లేట్ ఇడ్లీ తిన్నాడు. అయితే ప్లేట్ ఇడ్లీ ఖరీదు రూ.24 కాగా హోటల్ యాజమాన్యం ఆయనగారి దగ్గరి నుంచి రూ.25 వసూలు చేసింది. ఆపై తన దగ్గర రూపాయి ఎక్కువ వసూలు చేశారని గ్రహించిన, దాన్ని తీవ్రంగా పరిగణించి హోటల్ యాజమాన్యంపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తనలాగా ఆ హోటల్ కి వచ్చే ఒక్కో వినియోగదారుడి నుంచి రూపాయి చొప్పున ఎక్కువ తీసుకుంటున్న హోటల్ రోజుకు ఎంత అక్రమంగా తీసుకుంటున్నదీ లెక్కలు వేసి మరీ చూపించారు. దీంతో వినియోగదారుల ఫోరం హోటల్‌కు నోటీసులు పంపింది.

అయితే మధ్యాహ్న భోజన పథకం కోసం స్వచ్ఛంద సంస్థల విరాళాల సేకరణలో భాగంగానే తాము ఆ ఒక్క రూపాయి అదనంగా విరాళం ఇచ్చేందుకే కస్టమర్ల నుంచి రూపాయి అదనంగా తీసుకుంటున్నట్టు హోటల్ యాజమాన్యం పేర్కొంది. ఈ వాదనతో కన్జ్యుమర్ ఫోరం ఏకీభవించలేదు. అదనంగా రూపాయి వసూలు చేసిందుకు నష్టపరిహారం కింద బాధితుడికి వెయ్యి రూపాయలు చెల్లించడంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని 2014లో ఆదేశించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ హోటల్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశిస్తూ కేసును డిస్మిస్ చేసింది. ఈ మధ్య హైదరాబాద్ లో ఓ లేడీ కండక్టర్ రూపాయి నొక్కేసిందటూ ప్రయాణికురాలు గొడవ చేయటం, ఫిర్యాదుతో ఆ కండక్టర్ ను బదిలీ చేయటం, మద్ధతుగా కార్మికులు ఒక్కరోజు సమ్మె చేయటం, కోటి రూపాయల దాకా నష్ట వాటిల్లడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore  Lawyer  Hotel  one Rupee  

Other Articles