బర్లింగ్టన్ కాల్పుల అనుమానితుడు అరెస్టు.. Police arrest 20-year-old suspect

Us burlington shopping centre suspect arrested in mall shooting

US shooting,cascade mall,burlington shooting,Washington Shooting,burlington,Cascade Mall in Burlington,Burlington survivors

One day after a shooting left five people dead at a mall north of Seattle, authorities arrested a 20-year-old suspect Saturday after an overnight manhunt that left the city on edge.

అమెరికాను వణికిస్తున్న గన్ కల్చర్.. దుండగుడి అరెస్ట్..

Posted: 09/25/2016 07:21 AM IST
Us burlington shopping centre suspect arrested in mall shooting

అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ స్థానికులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ సాయుధ కల్చర్ పై ఇటీవల స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు సాయుధుడు గడగడలాడించిర విషయం తెలిసిందే. అమెరికాలోని వాషింగ్టన్ లోని ఓ మాల్‌ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఐదుగురిని హత్య చేసిన ఘటనలో పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ స్టేట్ పెట్రోల్ విభాగం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్‌లోని మాల్‌లోని కాస్కేడ్ మాల్ లో కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నామని వివరించారు. దాడి అనంతరం అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, తుపాకీ ధరించిన వ్యక్తి కనిపించాడు. ఆపై మరో పది నిమిషాల తరువాత రోడ్డుపై అతను నడిచి వెళుతున్న ఫుటేజ్ లభించింది వీటి ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు, ఈ ఘటన స్థానికంగా పెను కలకలాన్ని రేపింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

1990లో బర్లింగ్టన్‌లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్‌లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో వీకెండ్ రోజులతో పాటు పనిదినాల సాయంకాల వేళల్లోనూ షాపింగ్ మాల్ కు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఇది ఉగ్రవాద చర్యా..? లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us shooting  cascade mall  burlington shooting  Washington  

Other Articles