కావేరి వివాదంపై మోదీ మనసులో ఏముంది | PM Modi response on Cauvery issue

Pm modi response on cauvery issue

PM Narendra Modi on Cauvery issue, Modi on Cauvery issue, Modi calls for maintain peace in Cauvery issue, stop violence in Cauvery issue, Modi Cauvery Chaos

PM Narendra Modi appeals to people to stop violence in Cauvery issue.

కావేరి జలవివాదంపై మోదీ స్పందన

Posted: 09/13/2016 01:37 PM IST
Pm modi response on cauvery issue

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కావేరి కారు చిచ్చుపై ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం స్పందించారు. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను కలిచివేశాయని అంటున్నారు. హింసతో ఏ సమస్యలు పరిష్కారం కావని ఆయన ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. వివాదాల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. హింసతో సమస్యలు మరింత జటిలమవుతాయని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కావేరీ జల సమస్య కూడా చర్చలతో పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భావోద్వేగాలకు గురి కాకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

చ‌ట్టాన్ని అతిక్ర‌మించి ముందుకెళ్ల‌డం మంచి ప‌ద్ధ‌తి కాదని, దాడుల‌తో సామాన్య‌ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించ‌వ‌ద్దని కోరారు. రోడ్ల‌పైకి వ‌చ్చి ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆస్తుల‌కు నష్టం క‌లిగించ‌డం వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారం కాదని ఆయ‌న సూచించారు. దేశ స‌మైక్య‌త కోసం పాటు ప‌డే బాధ్య‌త గ‌ల పౌరులుగా ప్ర‌జ‌లు న‌డుచుకోవాల‌ని మోదీ అన్నారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి హింస మార్గం కాదని సూచించిన ఆయన.. చ‌ర్చ‌ల‌తోనే స‌మ‌స్యల‌ను పరిష్క‌రించుకోవ‌చ్చ‌ని చెప్పారు. క‌ర్ణాట‌క-త‌మిళ‌నాడు మ‌ధ్య కావేరి నీటి వివాదం సున్నిత అంశమ‌ని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ వివాదాన్ని న్యాయప‌రంగా ప‌రిష్క‌రించుకోవాలని సూచించారు.

కాగా, ప్రస్తుతం బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Cauvery Dispute  Chaos  

Other Articles