హోదా, ప్యాకేజీ అసలు ఏంటీ తేడా? | Difference between package and special status

Difference between package and special status

Difference between package and status, package and status which is better to AP, Andhra Pradesh special package news, special status states in India, Special Status history in India,

Difference between package and special status.

హోదా వర్సెస్ ప్యాకేజీ రెండింట్లో ఏది బెటర్?

Posted: 09/13/2016 12:41 PM IST
Difference between package and special status

పంపకాల పిదప తెలంగాణ ఆర్థికంగా ఎటూ బలంగానే ఉంటుంది గనుక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంటగడతామని విభజన సమయంలో యూపీఏ తానా అంటే, దానికి తగ్గట్లు ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇచ్చి తీరాలని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ తందాన అంది. సంవత్సరం తిరిగేసరికి రెండు పార్టీలు పొజిషన్ లు మారిపోయాయి. వాటికి తగ్గట్లే స్వరాలు కూడా మార్చేశాయి. ప్రజల పక్షాన పోరాడతామంటూ కాంగ్ నడుం బిగిస్తే... ఇతర రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయంటూ టెక్నికల్ సమస్య చూపిస్తూ హోదా ఇవ్వొలేమంటూ ఆ తప్పును ఆర్థిక సంఘం పైకి నెట్టేసి భారీ ప్యాకేజీ తో సరిపెట్టుకోవాలని కమలం చెబుతోంది.

అయితే ప్రత్యేక ప్యాకేజీపై విపక్షాలు భగ్గుమనగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డులాగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలనే విపక్షాల మొండిపట్టు, మరోవైపు హోదాకు ‘మించి’ ఇస్తామని కేంద్రం, అసలు హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమిటి? ప్యాకేజీ వల్ల పోయేదేమిటి? అన్న సంగ్ధిగ్ధంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాల విషయాలను కాసేపు పక్కనబెడితే...

హోదా ఉన్న రాష్ట్రాలకు రూల్స్ ప్రకారం కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో తిరిగి కొంత భాగాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రాష్ట్రాలకు చెల్లించాలి. కానీ, మోదీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక వ్యయం ఊసెత్తడం మానేశారు. దీంతో హోదా ఉన్న రాష్ట్రాలకు అందే 30 శాతం నిధులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాల మధ్య పెద్దగా తేడా ఉండదు. ఇదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం పేర్కొంది.

ఇప్పటి వరకు హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలకు కూడా ఇకనుంచి ప్యాకేజీ మాత్రమే లభిస్తుంది. దీనికి తోడు ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది. హోదా ఉన్న 11 రాష్ట్రాలతో పాటు ఏపీ, బెంగాల్, కేరళకు కూడా ఈ నిధులు ఇచ్చారు. ఏపీకి ఐదేళ్లలో రూ. 22,500 కోట్లు కేటాయించారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ప్రణాళిక వ్యయం కింద అదనంగా నిధులు అందుతాయి. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక నిధుల్లో 30 శాతాన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేశారు. మిగతా 70 శాతాన్ని మిగతా రాష్ట్రాలకు పంచుతారు.

1968 నుంచి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలున్నా... ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో 2002లో పన్ను రాయితీల అంశం తెరపైకి వచ్చింది. అయితే అది కూడా ఐదేళ్లపాటే అన్న నిబంధన మీద తీసుకొచ్చారు. ఆపై 2005లో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు పన్ను రాయితీలిచ్చారు. మొదట ఐదేళ్లపాటు ఇచ్చిన తర్వాత ఒకసారి ఐదేళ్లు, మరోసారి రెండేళ్లు చొప్పున పెంచారు. 2014 తర్వాత హోదా ఉన్న 8 రాష్ట్రాల్లో మినహాయింపులు ఆగిపోగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లకు 2017లో నిలిపివేస్తున్నారు. ఫలితంగా దేశం మొత్తం ఒకే పన్ను రాయితీ ఉంటుంది.

14వ ఆర్థిక సంఘం, చౌహాన్ కమిటీ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఇక ‘ముగిసిన చరిత్ర’ అని కేంద్రం వాదిస్తోంది. అందుకే హోదాకు సమానంగా సాయం చేస్తామని ప్రకటించింది. ఏపీకి ప్యాకేజీ ఐదేళ్ల పాటు కొనసాగుతుందని జైట్లీ ప్రకటించారు. ఫలితంగా ఏపీకి రుణం రూపంలో రూ.22,500 కోట్లు, మధ్యకాలిక రుణం(5-7)గా రూ. 22,500 కోట్లు కలిపి మొత్తం రూ.45వేల కోట్లు వస్తాయి. ఇది తక్కువ మొత్తం కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీకే విలువలేని వేళ... చట్టబద్ధత లేని జైట్లీ ప్రకటనకు విలువేంటన్నది ఇప్పుడు అసలు సమస్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Special Status  Special Package  Difference  

Other Articles