Ex-CJI RM Lodha warns, weighs in over collegium: Justice Chelameswar has a point

Cji hopes to sort out issues raised by justice chelameswar

collegium, collegium issue, collegium ruling, supreme court, supreme court judges, sc judges, njac, njac verdict, lodha, justice lodha, rm lodha, justice chelameswar, justice chelameswar collegium, india news

Chief Justice of India T S Thakur expressed hope that the controversy arising out of the refusal of Justice J Chelameswar to take part in Collegium meetings would be sorted out.

కొలీజియం వివాదం సమపినట్లే: పీజేఐ ఠాకూర్

Posted: 09/04/2016 08:35 AM IST
Cji hopes to sort out issues raised by justice chelameswar

కొలీజియం సమావేశాల్లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించడంతో తలెత్తిన వివాదం సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ అభిప్రా యపడ్డారు. శనివారం ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఠాకూర్  పైవిధంగా స్పందించారు. తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదంటూ గురువారం కొలీజియం సమావేశానికి చలమేశ్వర్ గైర్హాజరయ్యారు. దీంతో సమావేశం వాయిదా పడింది. కొలీజియంలో ఠాకూర్‌తో పాటు జస్టిస్ దవే, జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ దీపక్, జస్టిస్ చలమేశ్వర్ సభ్యులు.  

కాగా, మారుతున్న న్యాయ అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యలో మార్పులు రావాలని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం సమావేశానికి గైర్హాజరుపై మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే న్యాయమూర్తుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేవలం ఇద్దరు వ్యక్తులే న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తారని.. సమావేశంలో వాటికి ఓకేనా కాదా అని మాత్రమే అడుగుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేసే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CJI Thakur  Collegium  Chelameswar  RM Lodha  Supreme Court  

Other Articles