కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్న నేటి కాలంలో దేశాంతర వివాహాలు కూడా జరగడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని మెచ్చి, నచ్చి ఎందరో విదేశీ వనితలు భారతీయ యువకులను వివాహాలు చేసుకున్నారు. పలువరు హైందవ దర్మాన్ని అనుసరించగా, మరికోందరు వారి మతాలనుచారం ప్రకారం పరిణయం చేసుకున్నారు. కాగా ధాయాది దేశం పాకిస్థాన్ లోని యువతని ఓ పోలీసు అధికార పెళ్లాడమే సంచలనంగా మారింది.
ఓ పక్క కశ్మీర్ లోయలో పాకిస్థాన్ అనుకూల నిరసనలు గత రెండు నెలలుగా కొనసాగుతుండగా.. శ్రీనగర్ కు చెందిన ఓ యువ పోలీస్ అధికారి.. పాక్ అమ్మాయిని పెళ్ళాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ ఒవైస్ జిలానీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ కు చెందిన ఫైజా జిలానీని వివాహమాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆందోళనల నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు వధూవరుల దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కావాల్సి వచ్చింది.
లోయలో దాదాపు రెండు నెలలపాటు అశాంతి నెలకొనడానికి తోడు.. నిరసనకారులు ఆగ్రహావేశాల్లో ఉండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో వివాహ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అయితే వధూవరులిద్దరూ దగ్గరి బంధువులే అయినా.. ఆ రెండు కుటుంబాలూ పాకిస్థాన్ విభజన సందర్భంలో విడిపోయాయి. అనంతరం శాంతి కారవాన్ పేరిట శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ మధ్య బస్ సేవలు ప్రారంభమవ్వడంతో.. వరుని తండ్రి షబీర్ జిలానీ.. 2014 లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తమ బంధువులను కలసి 'నిఖా' చేసుకున్నారు.
వివాహం కుదుర్చుకున్న అనంతరం అనేక మార్లు క్రాస్ లాక్ బస్సు రద్దు కావడంతో వివాహం కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇటీవల సదరు బస్ సర్వీసులను పునరుద్ధరించడంతో వధువు సహా ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు వచ్చి శ్రీనగర్ లోని ఓ హోటల్ లో వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. సీనియర్ జిలానీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. దీంతో ఇస్లామాబాద్ నేషనల్ యూనివర్శిటీలో ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కుమార్తె.. ఫైజీ జిలానీకి, కశ్మీర్ లో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న.. తమ బంధువైన ఒవైస్ జిలానీతో.. వివాహం జరిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more