యూపీ ఎన్నికల కోసం రాహుల్ సుడిగాలి పర్యటన | Rahul Gandhi to cover 42 UP districts in 25 day roadshow

Rahul gandhi to cover 42 up districts in 25 day roadshow

Rahul Gandhi UP election campaign, Rahul Gandhi UP road show, Rahul Prashant kishore, RAhul UP election

Rahul Gandhi to cover 42 UP districts in 25 day roadshow for Assembly election ahead.

సుడిగాలి పర్యటనతో ఏమైనా ఒరుగుతుందా?

Posted: 08/27/2016 09:34 AM IST
Rahul gandhi to cover 42 up districts in 25 day roadshow

తన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీకి కీలకంగా మారబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ కదిలాడు. గెలుపే లక్ష్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. రాష్ట్రంలో 25 రోజుల పాటు ఏకధాటిగా రోడ్ షో నిర్వహించడం ద్వారా 42 జిల్లాల్లోని సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను చుట్టి రావాలని నిర్ణయించాడు.

ముఖ్యంగా గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా రాహుల్ పర్యటన సాగనుందని తెలుస్తోంది. యూపీ తూర్పు ప్రాంతంలోని డియోరియా నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే రాహుల్ యాత్ర పడమర ఉన్న నోయిడాతో ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల ఇన్ చార్జి రాజ్ బబ్బర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కాగా, రాజ్ బబ్బర్ తో పాటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని షీలా దీక్షిత్ ప్రస్తుతం యూపీ జిల్లాలను చుట్టి వచ్చే పనిలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే.

దశాబ్దాల క్రితం యూపీలో దూరమైన అధికారాన్ని ఈ దఫా ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తే చేస్తోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయి కార్యకర్తలను ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న కాంగ్, త్వరలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ప్రశాంత్ తో పని చేసేందుకు తమకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయని ఇప్పటికే పలువురు రాహుల్ దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంలో కలుగుజేసుకోవాల్సిందిగా సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను రాహుల్ కోరినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  UP election  Road Show  tour  

Other Articles