30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ | Bus driver dies of cardiac arrest after saving 30 passengers

Bus driver dies of cardiac arrest after saving 30 passengers

Bus driver saves passenger life, bus driver cardiac arrest, Indian Bus Driver, saving 30 passengers, Bus driver dies

Bus driver venkateshan dies of cardiac arrest after saving 30 passengers.

తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా...

Posted: 08/27/2016 09:13 AM IST
Bus driver dies of cardiac arrest after saving 30 passengers

ఓవైపు తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా, తోటి వారి ప్రాణాలు కాపాడాడు ఓ డ్రైవర్. ఈ విషాద ఘటన వివరాళ్లోకి వెళ్లితే... తమిళనాడులోని 30 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు పెర్నాంబట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంకు బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్‌ వెంకటేశన్(41)‌కు గుండెల్లో నొప్పి రావటం ప్రారంభించింది. ఈ విషయాన్ని కండక్టర్ కి కూడా చెప్పి, ఆపై బస్సును నెమ్మదిగా పోనీవ్వటం ప్రారంభించాడు. అలా చిత్తూరు జిల్లా వెంకటగిరిలోని కోట బస్టాండ్‌కు చేరుకుని బస్సును నిలిపివేశాడు.

బస్సు స్లోగా వెళ్లటంపై ప్రయాణికులు డ్రైవర్ పై విరుచుకుపడగా, కండక్టర్ వారిని సముదాయించసాగాడు. అయితే బస్సు దిగిన డ్రైవర్ ఓ టీస్టాల్ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తున్నా డ్రైవర్ కనిపించకపోవడంతో వెతికిన ప్రయాణికులు, కండక్టర్‌కు ఆయన గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే చిత్తూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

తమ ప్రాణాల కోసమే డ్రైవర్ బస్సును స్లోగా పోనీచ్చాడని తెలియటంతో అప్పటిదాకా నిందించిన ప్రయాణికులు ఒక్కసారి విషాదంలో మునిగిపోయారు. విధి నిర్వహనలో తన చేతిలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా చేర్చి తాను మాత్రం కానరాని లోకాలకు వెళ్లిపోయిన వెంకటేశన్ మృతిపై అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతనికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bus driver  Chittoor  cardiac arrest  save  passenger life  

Other Articles