కొత్త జిల్లాల డ్రాఫ్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం | Draft Notification On Telangana New Districts released

Draft notification on telangana new districts released

Telangana New Districts, Telangana New Districts Draft, Telangana New Districts notification, Telangana New Districts Draft, Telangana New Districts KCR, Telangana New Districts finalised, Draft Notification On Telangana New Districts, !7 new districts for Telangana

Draft Notification On Telangana New Districts released.

నవ్య తెలంగాణకు నోటిఫికేషన్ జారీ

Posted: 08/22/2016 01:50 PM IST
Draft notification on telangana new districts released

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తరువాతి దశగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్తగా 17 జిల్లాలకు సంబంధించి ఢ్రాఫ్ట్ తో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ పై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. 194 జీవో అనుసారం కొత్త జిల్లాల డ్రాఫ్ట్ కు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన ఫిర్యాదులను నెల రోజుల పాటు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 9 జిల్లాలకు ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నాలుగు అంచెల్లో అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరించనున్నారు.

ఇందుకోసం ఆయా జిల్లాల వెబ్ సైట్లను కూడా సంప్రదించే వీలు కలప్పించారు. ప్రజలెవరైనా ఆన్‌లైన్‌లోనే నేరుగా అభిప్రాయాలను పొందుపరచవచ్చు. నాలుగు అంచెల్లో తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం, కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలోనూ విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత వీటిని మన్నించారా.. తిరస్కరించారా అనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు. సెప్టెంబరు 20వ తేదీ దాకా అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఆ తర్వాత 15 రోజుల పాటు వీటిని పరిశీలించి.. అక్టోబరు రెండోవారంలో తుది నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సెప్టెంబర్‌ నెలలో మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 5వ, 20వ తేదీల్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ గడువు పూర్తి కాగానే అభ్యంతరాల పరిశీలన తర్వాత కొత్త జిల్లాలకు తుది రూపు ఇస్తారు. ప్రక్రియలో జాప్యం లేకుండా త్వరగతిన పూర్తిచేసి దసరా రోజున కొత్త జిల్లాలను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  New Districts  17  Draft Notification  

Other Articles