మోదీ చాయ్ పే చర్చ టీ స్టాల్ మూసివేత | Modi Chai pe Charcha tea stall shuts down

Modi chai pe charcha tea stall shuts down

Ahmedabad tea stall close, Modi Chai pe Charcha teastall shuts down, Modi teastall shuts down, Modi Ahmedabad tea stall

Ahmedabad tea stall where Modi held Chai pe Charcha shuts down

మోదీ టీ స్టాల్ ను మూసేశారు

Posted: 08/22/2016 01:20 PM IST
Modi chai pe charcha tea stall shuts down

చాయ్ వాలా జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని పీఠం పైకి ఎక్కి కూర్చున్న ఘనత నరేంద్ర మోదీది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశాన్నే బేసిక్ ప్రచార అస్త్రంగా వాడుకుని, చరిత్ర కందని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేనా మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాడు.

ఎక్కడో అధో:పాతాళంలో ఉన్న పార్టీకి అన్ని సీట్లు రావడానికి కారణం ఒక్కటే. అదే, మోదీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ రూపుదిద్దిన ‘చాయ్ పే చర్చా’. అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన ఈ కార్యక్రమానికి ఆజ్యం పోసి వేదికగా నిలిచింది ఓ సాధారణ టీ స్టాల్. మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాదులో ‘ఇస్కాన్ గాంతియా టీ షాప్’ పేరిట వెలసిన ఈ టీ స్టాల్ దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుని ఆకర్షించింది.

అయితే రెండేళ్ల తర్వాత సదరు టీ స్టాల్  ఇప్పుడు మరోసారి హెడ్ లైన్స్ లో ప్రముఖంగా నిలిచింది. నిజానికి ఇస్కాన్ గాంతియా టీ షాప్ నకు సర్కారీ పర్మిషన్ లేదట. రెండేళ్లుపైగా ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న లేకుండానే వెలసిన ఈ టీ స్టాల్ కు మోదీ మేనియాతో జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు ఆ టీ స్టాల్ వద్ద నిలుపుతున్న వాహనాలు పెను సమస్యగా మారాయి. తాజాగా షాపు అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలన్న అహ్మదాబాదు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశాలకు యాజమాన్యం స్పందించలేదు. వెరసి సదరు ఇస్కాన్ గాంతియా టీ షాపు రెండున్నరేళ్లు గడవకముందే మూతపడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Chai pe Charcha  tea stall  shuts down  

Other Articles