'Idiotic' To Attack New RBI Governor Urjit Patel, Says Subramanian Swamy

It will be idiotic to attack urjit patel subramanian swamy

Urjit Patel, Subramanian Swamy, Raghuram Rajan, Inflation, urjit patel, urjit patel rbi, rbi, rbi governor, new rbi governor, who is urjit patel, urjit patel rbi governor, rbi governor urjit patel, new rbi gov

Urjit Patel's appointment as new RBI Governor appeared to have support of BJP MP Subramanian Swamy who had launched a series of attacks against the outgoing Governor Raghuram Rajan

స్వామి రూటు సెపరేటు.. ఆయనపై విమర్శలు.. ఈయనపై ప్రశంసలా..

Posted: 08/21/2016 09:33 AM IST
It will be idiotic to attack urjit patel subramanian swamy

విదేశాలలో ముఖ్యంగా అమెరికాలోని విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్థిక ప్రోఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారని.. వారితో సన్నిహితంగా మెలుగుతున్నారని.. అమెరికా పౌరసత్వం కూడా వుండటంతో ఆయనకు అర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించే హక్కే లేదని బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే పదవికి ఏకంగా విదేశాలలోనే జన్మించిన ప్రస్తుత అర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను నియమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

రఘురామ్ రాజన్ అమెరికా పౌరసత్వమున్న వ్యక్తని అరోపణలు గుప్పించిన సుబ్రహ్మణ్యస్వామి ఉర్జిత్ పటేల్ ను విదేశీ అని విమర్శించడం మూర్ఖత్వమని నెట్ జనులను అడిపోసుకుంటున్నాడు. రఘురామ్ రాజన్ విషయంలో ఒకలా..  కొత్త గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్‌ పటేల్‌ విషయంలో మరోలా ప్రతిస్పందించడం సుబ్రహ్మణ్యస్వామి చాకచక్యమా..? లేక కేంద్రం అయనను అడ్డుగా పెట్టుని ఇలా ఉర్జిత్ పటేల్ పై నెట్ జనులు నుంచి విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తుందా..? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్‌ పటేల్‌ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్‌3 (రఘురాం రాజన్‌) మాత్రం భారత్‌లో పుట్టి, అమెరికా గ్రీన్‌ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్‌లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్‌లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్‌3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు. అయినవారికి అకుల్లో పెట్టి, కానీ వారికి కంచాల్లో పేట్టడం మన రాజకీయ నాయకులకు బాగా తెలుసిన విషయమని ఈ అంశంలో రుజువైందన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urjit Patel  Subramanian Swamy  Raghuram Rajan  Inflation  Indian economy  

Other Articles