Raid at Muthoot Group: Main offices, family house targeted

Raids at 60 offices of muthoot group

it raids at muthoot finanace, it raids on muthoot finance offices, IT Raids at 60 offices of Muthoot Group, Income Tax Department, Muthoot group, tax evasion, IT Raids, black money, money kaundering

The Income tax department, along with the enforcement, raidedall the offices of the Muthoot Group in Kerala and across the country.

ముత్తూట్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు..

Posted: 08/06/2016 07:52 AM IST
Raids at 60 offices of muthoot group

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చడంలో కాస్త జాప్యం చేస్తుందేమో కానీ.. ప్రధాని పలు మార్లు హెచ్చరించిన ఆ ఒక్క విషయంలో మాత్రం క్రమం తప్పకుండా చక్కగా చర్యలు చేపడుతుంది. నల్లధనం ఎక్కడ వున్నా, ఏ రూపంలో వున్నా వెంటనే దానికి సంబంధించిన పన్నులను కట్టాలని , లేని పక్షంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో సరిగ్గా అలానే వ్యవహరిస్తుంది కేంద్ర అదాయ పన్నుశాఖ.

ఇటీవల ఇండియన్ బుల్స్ ఫైనాన్స్ సంస్థలపై దాడులు నిర్వహించి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇటీవల కాలంలో ఏకకాలంలో చేసిన దాడుల్లో అతిపెద్ద దాడిగా పేర్కోన్నారు. తాజాగా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలపై దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వున్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలలోని 60 శాఖలపైన ఆదాయశాఖ అధికారలు దాడులు నిర్వహించారు.  పన్ను ఎగవేత అరోపణల నేపథ్యంలో ముత్తూట్ సంస్థ బ్రాంచ్ లపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు కీలక నగరాలతో పాటు కేరళలోని కొన్ని ముఖ్య పట్టణాలలో ముత్తూట్ ఆస్తులపై అధికారులు ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి.

తిరువనంతపురం, కొచ్చి, కొలెన్చెర్రీలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, కొయంబత్తూర్, చెన్నై, బెంగళూరు నగరాలలో సోదాలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేటి (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఇప్పటికీ కొన్ని నగరాలలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీలలో భాగంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు ముత్తూట్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా దేశీయ మార్కెట్లు సుమారుగా నాలుగు వందల పాయింట్ల లాభాన్ని అర్జించిన క్రమంలో ఆదాయశాఖ అధికారుల అకస్మిక దాడుల నేపథ్యంలో ముత్తూట్ సంస్థ షేర్లు మాత్రం రెండు నుంచి మూడు శాతం వరకు దిగజారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax Department  Muthoot group  tax evasion  IT Raids  black money  money kaundering  

Other Articles