తెలంగాణ ఆర్థిక స్థితి అస్సలు బాగోలేదు | telangana RTC heavy loss continues

Telangana rtc heavy loss continues

Telangana RTC heavy loss, economically back, telangana heavy loss, telangana status, KCR on telangana economy, telangana financial status

Telangana RTC heavy loss continues, other departments also.

సొంత రాష్ట్రంలోనే కష్టాలు ఎక్కువవుతున్నాయా?

Posted: 08/03/2016 04:11 PM IST
Telangana rtc heavy loss continues

సొంత రాష్ట్రంతోనే అభివృద్ధి అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంకు భవిష్యత్తులో ఆర్థిక చిక్కులు తప్పవా? రానున్న మూడేళ్లలో లోటు బడ్జెట్ లోకి చేరిపోనుందా? అసలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పైకి కనిపిస్తున్నట్లు నిజంగానే ఘనంగా ఉందా? పూర్తి ఆర్థిక నివేదికలను పరిశీలిస్తే అదంతా జరగబోతుందనే చెప్పొచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నీ కష్టాలే మొదలౌతున్నాయని ఆర్థిక నిపుణులు లెక్కలేసి మరీ చెబుతున్నారు.

ఈ మధ్య కష్టాలు, తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మూసేద్దామని బెదిరించి, ఆపై ఎలాగైనా బతికించుకుందామని ముఖ్యమంత్రి అధికారులతో వ్యాఖ్యానించడం, అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం తెలిసిందే. ఇది గడిచి నెల దాటుతున్న పరిస్థితి ఏ మాత్రం మారలేదని లెక్కలు చెబుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ ఆర్టీసీ రూ. 900 కోట్ల మేరకు నష్టాలను భరించాల్సి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేతనాలు పెరగడం, అలవెన్సుల భారానికి తోడు, పాత రుణాలపై కట్టాల్సిన వడ్డీలు పెనుభారం కాగా, మరో 8 నెలలు మిగిలి ఉండగానే నష్ట స్థాయిపై అంచనాలను లెక్క తేల్చారు.

ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులు సంస్థ పరిస్థితిని సమీక్షించి, ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల కన్నా, విడిపోయిన తరువాత టీఎస్ ఆర్టీసీ నష్టం ఎక్కువగా ఉండనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆర్టీసీ ఉన్న సమయంలో 2013-14లో అత్యధికంగా రూ. 908 కోట్ల మేరకు నష్టాన్ని ఆర్టీసీ భరించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క విభాగంలోనే కాదు... దాదాపు అన్ని శాఖలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి రెండేళ్లకే ఇలా అయితే. రానున్న రోజుల్లో ఇది ముదిరితే మాత్రం ఆర్థిక చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  loss  united state  RTC  financial  

Other Articles