కృష్ణా పుష్కరాలపై డాక్టర్ సమరం షాకింగ్ కామెంట్లు | Doctor Samaram shocking comments on Krishna Pushkaras

Doctor samaram shocking comments on krishna pushkaras

Doctor Samaram on Krishna Pushkaras, Samaram shocking comments, Samaram shocking comments on government, Samaram about pushkaras

Doctor Samaram shocking comments on Krishna Pushkaras.

పుష్కరాలపై సమరం సమయం

Posted: 08/02/2016 08:05 AM IST
Doctor samaram shocking comments on krishna pushkaras

డాక్టర్ సమరం... ఈయన ఎందులో స్పెషలిస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు వైద్యుడిగా సేవలు అందిస్తూనే, మరోవైపు టీవీ షోలలో దాంపత్య జీవితానికి, శృంగార సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ ఉంటారాయన. అలాంటి వ్యక్తి పుష్కరాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త కలకలాన్నే రేపుతున్నాయి.

అసలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని సమరం చెబుతున్నారు. సెక్యులర్ దేశంగా భారత్ లో సర్వమతాలకు సమాన ప్రాధాన్యం ఉందని, అలాంటిది ఒక మతాన్ని, వారి సాంప్రదాయన్ని గౌరవిస్తూ పుష్కరాలు నిర్వహించడం నేరమంటూ వ్యాఖ్యానించాడు. ఒకర్ని చూసి ఒకరు నదుల్లో స్నానం చేయడానికి వెళ్తుంటారు తప్ప, భక్తితో వెళ్లేవాళ్లు తక్కువ మంది ఉంటారని ఆయన చెప్పారు. ఒక నదిలో ఎన్నో ఉపనదులు, పిల్లకాలువలు, ఇంకెన్నో వాగులు వంకలు కలుస్తాయని, వాటన్నింటికీ ఎందుకీ పవిత్రత ఉండదని ఆయన తెలిపారు.

మతం పేరుతో మూఢనమ్మకాలను మతాచార్యులు ప్రచారం చేస్తే... ఆ ప్రచారాలను జనాలు నమ్ముతుంటే... వాటిని ఓట్లుగా మలచుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. రాజుల కాలంలో కూడా పుష్కరాలను నిర్వహించడమనే సంప్రదాయాలు లేవని, ప్రజాస్వామ్య భారత దేశంలో మాత్రం ప్రభుత్వాలే పుష్కరాలను నిర్వహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

అసలు పుష్కరాల వల్ల పుణ్యం రావడం సంగతి దేవుడెరుగు, రోగాలు మాత్రం పట్టుకుంటాయని ఆయన అంటున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వందలాది మంది రోగులకు వైద్యసేవలందించానని అన్నారు. సహేతుకంగా ఆలోచిస్తే... పుష్కరాలన్నీ పంచాగ కర్తల క్రియేషన్ అని, వాటి వల్ల జరిగే ఉపయోగాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. పుష్కరాల సమయంలో నదినీటిలో ఔషధ గుణాలు ఉంటాయనడానికి ఆధారాలు లేవని, నది ఏడాది పొడుగునా ప్రవహిస్తున్నప్పుడు కేవలం పుష్కరాల కాలంలోనే ఔషధ గుణాలు కనిపించి, ఆ తరువాత మాయవడం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటికే గోదావరి పుష్కరాల్లో పాలు పంచుకున్న వారి పాపాలు తొలగిపోయినప్పుడు, మళ్లీ కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. వైద్యుడిగా ఆయన తన వర్షన్ వినిపిస్తున్నాడు. మరీ దీనిపై స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doctor Samaram  Krishna Pushkaralu  diseases  government  

Other Articles