Bulandshahr incident 'shocking, shameful': Punia

Bulandshahr incident shocking shameful puniata

NCSC, National Commission for Scheduled Castes, NCSC Chairman PL Punia, Union Minister Anupriya Patel, Akilesh yadav, dalits, gangrape of a mother-daughter, uttar pradesh news, india news

National Commission for Scheduled Castes Chairman PL Punia and Union Minister Anupriya Patel of Apna Dal questioned the actions taken by the Uttar Pradesh government in the aftermath of the brutal gangrape of a mother-daughter duo, and called for administrative steps to prevent such incidents.

బులంద్ షహర్ ఘటనపై ఎస్సీ కమీషన్ దిగ్భ్రాంతి..

Posted: 08/02/2016 08:11 AM IST
Bulandshahr incident shocking shameful puniata

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘోరంపై జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. యూపీలోని బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇది సభ్య సమాజం యావత్తు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని పునియా అన్నారు. ఇప్పటివరకు జరుగతున్న అత్యాచారాలపై ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవడంతో విఫలమైనందునే.. ఇలా తల్లి కూతుళ్లపై సామూహిత అత్యాచారాలు జరుగుతున్నాయిని అయన అవేధన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ పునియా, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ప్రశ్నించారు.

'బులంద్ షహర్ లో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది. మొత్తం సమాజానికి సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త పరిష్కార మార్గం తీసుకురావాలి. పోలీసులు అవినీతికి పాల్పడి లంఛాలు తీసుకుంటున్నారు కానీ విధులు నిర్వర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నాయి. అఖిలేశ్ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందే' అని పునియా అన్నారు.

ఇక కేంద్రమంత్రి అనుప్రియ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా ఒక సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అయితే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది తన ప్రధాన ఆందోళనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణకు తప్పకుండా చూడాలని, వారి సంరక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles