కాబూల్ లో జంట పేలుళ్లు... 50 మందికి పైగా మృతి | Deadly Blast At Afghan Protest 50 killed

Deadly blast at afghan protest 50 killed

Deadly Blasts in protest, Kabul Blast, 50 killed and hundreds injured, Kabul blast hundreds injured

Deadly Blasts in protest rally in Kabul 50 killed and hundreds injured.

కాబూల్ లో జంట పేలుళ్లు... 50 మందికి పైగా మృతి

Posted: 07/23/2016 05:25 PM IST
Deadly blast at afghan protest 50 killed

ఏ సమయంలో ఎక్కడ నుంచి ఉగ్ర‌వాదుల దాడులు సాగుతాయో తెలీక సామాన్యులు బిక్కు బిక్కుమనుకుంటూ జీవిస్తున్నారు. ఇన్నాళ్లూ ఒక్క ఇస్లాం దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇప్పుడు అన్ని దేశాలకు పాకాయి.  ప్ర‌తిరోజు ప్ర‌పంచంలోని ఎక్క‌డోచోట ఉగ్ర‌వాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. జర్మనీ మ్యూనిచ్ దాడి జరిగి ఒక్కరోజు గడవక ముందే అఫ్ఘనిస్థాన్ జంట పేలుళ్లతో ఉలిక్కిప‌డింది.

కాబూల్‌లోని ద‌హ్మజంగ్ ప్రాంతంలో శనివారం జంట పేలుళ్లు సంభ‌వించాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందారు.  ర‌ద్దీగా ఉన్న ప్రాంతాలే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డ్డారు. వందల మంది షియా ముస్లింలు ఓ చోట చేరి నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతంలో బాంబులు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు సూసైడ్ బాంబర్స్ తమను తాము పేల్చుకున్నట్లు  పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల‌తో 50 మంది మృతి చెందినట్లు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగానే ఉండొచని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వెంట‌నే అక్క‌డకు చేరుకుని గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గత నెల నేపాల్ సెక్యూరిటీ సిబ్బంది లక్ష్యంగా జరిగిన దాడిలో 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabul  Blast  Afghan protest  suicide bombers  

Other Articles