Mayur Vihar murder: Woman killed Vijaykumar to avenge sexual exploitation, arrested

26 year old kills retired govt official to avenge sexual exploitation

murder, sexual exploitation, senior citizen murder, delhi senior citizen murder, delhi mayur vihar murder, delhi samachar apartment murder, man murdered in delhi, senior citizen murdered in delhi, revenge killing, Mayur Vihar murder, VijayKumar murder, CCTV, Ambily Vijaykumar

A 26-year-old woman was arrested in relation to a murder that took place in East Delhi's Samachar Apartments. The police said that the woman, who was found on the basis of CCTV footage, confessed to the murder.

నగ్న వీడియో తీసి లైంగికదాడి చేశాడని.. ప్రతీకారం తీర్చుకుందిలా..

Posted: 07/23/2016 07:27 PM IST
26 year old kills retired govt official to avenge sexual exploitation

ఉద్యోగం కోసం వెళ్లే తనకు తండ్రిలాంటి వ్యక్తి తన నగ్న వీడియో తీసి.. తనపై లైంగికదాడి యత్నించిన ఓ వృద్దుడిపై ఓ పాతికేళ్ల యువతి ప్రతీకారం తీర్చుకుంది. దేశరాజధాని ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని మయూర్ విహార్లో 65 ఏళ్ల వృద్ధుడు విజయ్కుమార్ హత్య కేసు కలకలం రేగడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఓ నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణించగా విస్తుపోయే నిజాలు విన్న పోలీసులు కేసు దర్యాప్తును మూసివేశారు. విశ్వసనీయ ఆధారం, సీసీటీవీ ఫుటేజి సాయంతో నిందితురాలిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.  

విజయ్కుమార్ తనపై లైంగికదాడి చేశాడని, తనను నగ్నంగా వీడియో తీశాడని, ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తితో పొడిచి చంపినట్టు నిందితురాలు అంగీకరించింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఆయనను కలిస్తే తనను శారీరకంగా వేధించాడని పోలీసులకు చెప్పింది. విజయ్ కుమార్ భార్య వసుంధర ఐటీ అధికారిణిగా పనిచేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. కుమార్తె ఫోన్ చేస్తే విజయ్ కుమార్ స్పందించలేదు. ఆమె విజయ్ కుమార్ ఫ్లాట్లోకి వచ్చి చూడగా, ఆయన రక్తపుమడుగులో పడిఉన్నాడు. ఆమె వెంటనే అలారమ్ మోగించి పోలీసులకు సమాచారం అందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles