Government to dole out free tickets for 'Kabali' to Sellipet residents

Kiran bedi distributes tickets to villagers for kabali

kiran bedi kabali, kabali kiran bedi, governer kabali tickets, kollywood rajini fan, Kabali movie, Rajinikanth, Kabali review, Rajinikanth, Kabali, Balaji srinivasan, america, rajinikanth, rajinikanth kabali, kabali, kabali screening, kabali fans screening, rajinikanth kabali fans, rajinikanth fans, kabali us, kabali us release, kabali movie, entertainment news

Puducherry Lt Governor Kiran Bedi distributed free tickets of Rajinikanth-starrer "Kabali" to villagers of Sellipet for constructing toilets in their homes as part of the Swachh Bharat Abhiyan.

వాళ్లకు టికెట్లు ఇచ్చి ‘కబాలి’ సినిమా చూడమన్న గవర్నర్

Posted: 07/22/2016 07:18 PM IST
Kiran bedi distributes tickets to villagers for kabali

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి ఇప్పటికే బాలీవుడ్ చిత్రం సుల్లాన్ ను నట్టేట ముంచి రికార్డు పందేరంలో దూసుకుపోతుండగా, తనకు తెలియకుండానే రజనీకాంత్ మరో మంచి పనికి కూడా కారణమవుతన్నాడు. అదేంటారా..? కబాలి సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చి సినిమాను చూడమని ప్రోత్సహిస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్. ఎవరా గవర్నర్..? ఎందుకలా కబాలి చిత్రం టికెట్లను ఇచ్చారు..? రజనీకాంత్ తనకు తెలియకుండానే చేస్తున్న మంచిపని ఏంటి..? ఇంతకీ ఎవరికి ఉచితంగా టికెట్లను ఇచ్చారన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి కదూ.

వివరాల్లోకి వెళ్తే కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచెరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాద్యతలు చేపట్టిన బీజేపీ పార్టీ తరుపున ఎంపికైన కిరణ్ బేడి పాండిచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ప్రజలను అభివృద్ది వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సొంత ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే రజనీకాంత్ తనకు తెలియకుండానే చేస్తున్న మంచిపని.

అయితే ప్రస్తుతం కబాలి ప్రభావం దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. సొంత ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టెకెట్లు ఇచ్చారు. కబాలి మానియా దాదాపు దక్షిణ భారతదేశమంతటా వైరల్‌గా ఉంది. తమిళనాడు, పాండిచ్చేరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ ప్రజల్లో ఉండే ఈ క్రేజ్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ విధంగా వినియోగించారు పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kollywood  rajini kanth  Lt  Governor  free tickets  swachh bharat abhiyan  pudichetty  

Other Articles