Mother and three daughters stabbed ‘for being inappropriately dressed’

Woman and girls stabbed by man at french alps resort

man stabs mother and 3 daughter for being scantil,mother and three stabbed at french alps, french resort, scantily dressed our stabed, garde-colombe, morocco man, terrorism, France, France, Man stab, woman and her three daughters, 2016 Nice terror attack

A woman and her three daughters have been stabbed in a French resort for being ‘scantily dressed’. An eight-year-old girl was left fighting for her life after the attack in the Garde-Colombe in the Hautes-Alpes region of Southern France.

ఫ్రాన్సులో ఉన్మాది ఘాతుకం.. కురచ దుస్తుల ధరించారని..

Posted: 07/20/2016 09:01 AM IST
Woman and girls stabbed by man at french alps resort

ఫ్రాన్సులోని నీస్ నగరంలో సముద్ర తీరాన తమ జాతీయ దినోత్సవ వేడుక సంబరాల్లో మునిగిన ప్రజలపైనుంచి భారీ వాహనాన్ని నడుపుతూ. 84 మంది ప్రాణాలను బలిగోన్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల నరమేధాన్ని ఇంకా అదేశ ప్రజలు మర్చిపోకముందే.. అక్కడ మరో దారుణం జరిగింది. ఓ యువకుడు ఉన్మాదిలా మారి ఓ తల్లి అమె ముగ్గురు కూతుళ్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో అమె ఎనమిదేళ్ల చిన్న కూతురు జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతుండగా, తల్లి సహా ఇద్దరు పెద్ద కూమార్తెల అరోగ్యం స్థిరంగా వుందని త్వరలోనే వారు కోలుకుంటారని వైద్యాధికారులు తెలిపారు.

దక్షిణ ఫ్రెంచ్ లోని అల్ప్ రెసార్ట్ ప్రాంతంలోని గార్డే-కొలంబే ప్రాంతంలో ఓ యువకుకు ఉన్మాదిలా మారి అటుగా వస్తున్న ఓ తల్లి సహా అమె ముగ్గురు కూతళ్లపై కత్తితో దాడి చేశాడు. అయితే నిందితుడు మొరాకో వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో లారగ్నే-మాంటెగ్లిన్ డిఫ్యూటీ మేయర్ జీన్ మార్క్ దుప్రాట్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. మహిళతో నిందితుడికి ఎలాంటి సంబంధం లేదని, అయితే తల్లి బిడ్డలు కురచ దుస్తులు ధరించారనే వారిపై ఉన్నాది దాడి చేశాడని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఎనమిదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో జీవన్మరణ పోరాటం చేస్తుందని వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళ (46) ముగ్గురు కూతుళ్లతో (14, 12, 8) కలసి దక్షిణ ఫ్రాన్స్​లో లరాగ్నె సమీపంలోని కొలంబె అల్పైన్ రిసార్ట్కు వెళ్లింది. వీరి గది పక్కనే నిందితుడు తన కుటుంబంతో కలసి బసచేసి అదను చూసి వారిపై దాడి చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : France  Man stab  woman and her three daughters  crime  

Other Articles