President's Escort Car Falls Into Gorge in Darjeeling, Mamata Banerjee Oversees Ops

Mamata banerjee s escort car falls into gorge in darjeeling cm safe

west bengal, mamata banerjee, convoy, car, darjeeling, president pranab mukharjee, President's Twitter account, Twitter, Hardik Patel, Pokemon, uber sweet ice-cream, France

An escort car for President Pranab Mukherjee fell into a gorge in Darjeeling today. All six security personnel traveling in the car were rescued in an operation that was overseen by West Bengal chief minister Mamata Banerjee.

రాష్ట్రపతి ప్రణబ్, మమతా బెనర్జీ, సెక్యూరిటీ అంతా సేఫ్..

Posted: 07/15/2016 01:37 PM IST
Mamata banerjee s escort car falls into gorge in darjeeling cm safe

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రాణాపాయ పరిస్థితుల నుంచి సరక్షితంగా బయటపడ్డారు. ఆయన వాహనాల శ్రేణిలోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. రాష్ట్రపతి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అయితే కాన్వాయ్‌లోని మిగతా వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇతర వాహనాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే రాష్ట్రపతి వాహనాల శ్రేణిని వెనుకగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ కూడా అసుసరించింది. ఈ క్రమంలో అమె రాష్ట్రపతి కాన్వాయ్ లోని ఓ వాహనం లోయలో పడినట్లుగా గుర్తించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలసి పాల్గోనే ఓ కార్యక్రమానికి వెళ్తున్న మమత.. రాష్ట్రపతి వాహణాల శ్రేణిలోని ఓ వాహనం.. డార్జిలింగ్‌లోని బ్యాగ్డోగ్రా ప్రాంతం సోనాడా వద్దకు చేరుకోగానే.. కఠినమైన ములుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయిందని గుర్తించారు. దీంతో వాటని అనుసరిస్తూ వస్తున్న రాష్ట్రపతి, ముఖ్యమంత్రి కాన్వాయ్ ల డ్రైవర్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదమే తప్పింది. కాగా మమతా బెనర్జీ ఘటనాస్థలంలోనే వుండి లోయలో పడిన సెక్యూరిటీ సబ్బందిని బయటకు తీసే అపరేషన్ పూర్తయ్యే వరకు అక్కడే వుండి పర్యవేక్షించారు.

అయితే కాన్వాయ్ లు అనుసరిస్తూ వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి వాహనం కూడా ఉందా..? అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. కాగా, లోయలో పడిన వారిని రక్షించే అపరేషన్ జరుగుతున్న క్రమంలో మమతా బెనర్జీని అక్కడి నుంచి వెళ్లమని, తాము చూసుకుంటామని పలువురు సెక్యూరిటీ సిబ్బంది అమెను విన్నవించినా.. అపరేషన్ పూర్తైయ్యే వరకు అమె అక్కడి నుంచి కదల్లేదు. మమత బెనర్జీతో పాటు రాష్ట్రపతి తనయ షర్మిస్తా, తనయుడు అభిజిత్ ముఖర్జీలు కూడా మమత బెనర్జీతో పాటుగా అక్కడే వుండి రాష్ట్రపతి భద్రతా సిబ్బందిని అస్పత్రికి తరలించేవరకు వున్నారు.

ఈ ఘటనలో ఎవరీకీ ఎలాంటి హాని కలగకుండా అందరూ సరక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అధ్యక్షుల వారి ట్విట్టర్ అకౌంట్ లో అందరూ సురక్షితమని చెప్పారు. ఇదోక దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకోచ్చిన ఆయన అకస్మాత్తుగా జరిగినా.. ఈ ఘటన నుంచి దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు. అయితే ఉదయం మంచు అధికంగా వుండటం వల్లే దారి కనబడకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక పెద్ద వాహనాల శ్రేణి ఘటనాస్థలం నుంచి కదిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west bengal  mamata banerjee  convoy  car  darjeeling  president pranab mukharjee  

Other Articles