టెర్రరిస్టులకు బూస్ట్ ఆ లెక్చరర్ పాఠాలు | Zakir Naik Islam speeches inspiration to terrorists

Zakir naik islam speeches inspiration to terrorists

Islam Preacher Zakir Naik, zakir Naik Speeches inspired to terriorists

Zakir Naik Islam speeches inspiration to terrorists.

టెర్రరిస్టులకు బూస్ట్ ఆ లెక్చరర్ పాఠాలు

Posted: 07/09/2016 01:03 PM IST
Zakir naik islam speeches inspiration to terrorists

ముంబైకి చెందిన జకీర్ నాయక్ ఒక లెక్చరర్. కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. అంతేకాదు ఇస్లాం గురించి సుమారు 4 వేలకు పైగా ఉపన్యాసాలు ఇచ్చాడు. అందుకోసం తన చానెల్ ను వాడుకున్నాడు. పేరుకు పీస్ చానెల్ అయినప్పటికీ అందులో ఆయన చేసినవన్నీ ఉద్రేకపూరిత ఉపన్యాసాలే. దీంతో రెచ్చిపోతున్న యువత ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన నరమేధానికి ఇతగాడి ఉపన్యాసాలే కారణమని తెలియటంతో యావత్ ప్రపంచం షాక్ కి గురయ్యింది.

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్)లో చేరాలనుకునే యువకులకు 50 ఏళ్ల ఈ ఇస్లాం బోధకుడి పాఠాలే ఇన్సిఫిరేషన్ గా నిలుస్తున్నాయంట. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారుల విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర లోని కళ్యాణ్‌కు చెందిన నలుగురు యువకులకు కూడా జకీర్ ప్రసంగాలే స్ఫూర్తినిచ్చినట్టు తెలుస్తోంది. నలుగురిలో ఒకరైన అరీబ్ మజీద్‌ను గతేడాది ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో తనకు జకీర్ ప్రసంగాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని విచారణలో అతను తెలిపాడు.

అలాగే 2010-11లో బిహార్‌లోని దర్భంగాలో పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూల్ గుట్టును రట్టుచేశారు. ఆ సమయంలో పోలీసులు జకీర్ ప్రసంగాల సీడీలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దీంతో జకీర్‌పై ఓ కన్నేసిన ప్రభుత్వం అతని ‘పీస్’ టీవీ చానల్‌పై నిషేధం విధించింది. ఇక హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకుంటున్నాడు. జకీర్ ప్రసంగ సీడీలను పరిశీలించడంతోపాటు జకీర్ పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు.

కాగా, జకీర్ తో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ వేదిక పంచుకోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ప్రపంచ శాంతి పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారే తప్ప వ్యక్తిగతంగా జకీర్ తో డిగ్గీరాజాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zakir naik  Peace TV  Bangla attack  NIA  rajnath singh  

Other Articles