3 suicide bombers hit mosque in Medina, kill 2; Two other cities targeted

Three cities in saudi arabia hit by suicide blasts

saudi arabia, saudi, saudi blasts, qatif, medina, medina blasts, saudi blast today, jeddah blast, saudi explosion, medina explosion, qatif explosion, world news

The attacks all seem to have been timed to coincide with the approach of Eid al-Fitr, the holiday that celebrates the end of the fast.

సౌదీలో పవిత్ర మదీనా మసీదు వద్ద వరుస పేలుళ్లు..

Posted: 07/05/2016 07:57 AM IST
Three cities in saudi arabia hit by suicide blasts

సౌదీ అరేబియా మరోమారు వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. రెండు రోజుల క్రితం సౌదీలోని జెడ్డాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  యూఎస్‌ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సౌదీలోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర ముష్కరులు దాడికి పాల్పడ్డారు. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం దేశంలో హైఅలర్ట్‌ ప్రకటించినా.. దేశంలోకి చోరబడ్డ ఉగ్రవాదులు మూడు ప్రాంతాలలో ఆత్మాహుతి దాడులు జరిపారు. వీటిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా మసీదు లక్ష్యంగా విరుచుకుపడిన ఐఎస్ ఉగ్రవాదులు అక్కడి సెక్యూరిటీ కార్యాలయానికి చెందిన పార్కింగ్ లో ఆత్మాహుతి దాడి చేశారు. మసీదునే లక్ష్యంగా చేసుకుని రంజాన్ మాసంలో రోజూ విడిచే ఉపవాస దీక్షా సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. మదీనాలోని ముస్లింల పవిత్ర కేంద్రాల్లో ఒకటైన ప్రాఫెట్ మసీదు వెలుపల మరో మానవ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఆరుగురు చనిపోయారు. మరోవైపు సౌదీలోని ఖాతిఫ్ నగరంలోని మసీదు వద్ద, ఆత్మాహుతి దాడి, కారు బాంబు పేలుడు సంభవించాయి. షియాలు అధికంగా నివసించే ఖాతిఫ్ పట్టణంలోని మసీదు ముందు బాంబు దాడులకు తెగబడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saudi arabia  bomb expolsions  medina mosque  shia muslims  foreigners  

Other Articles