10 yrs old raped and murdered in secundrabad

Minor girl raped and murdered in secundrabad bollaram

minor girl, rape, gang rape, murder, Old suspect anil, bollaram, secundrabad, old criminal, building construction labour, crime, rape in telangana, rape in secundrabad, rape in bollarum

10 years old girl raped and murdered in bollaram of secundrabad, police suspect old criminal anil behind the inncidenr.

మైనర్ బాలికపై అత్యాచారం.. అపైన..

Posted: 07/03/2016 07:43 AM IST
Minor girl raped and murdered in secundrabad bollaram

తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ బోల్లారం ప్రాంతంలో అభం శుభం తెలియని ఓ చిన్నారి పై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేశాడు. బొల్లారం పరిధిలోని కళాసిగూడలో ఈ దారుణ ఘటన జరిగింది. చిన్నారిని అపహరించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా నివాసముంటున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు అనిల్ అత్యాచారం చేసి హత్య చేశాడు.
 
శనివారం అర్ధరాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన అనిల్ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చి అక్కడే పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అనిల్ గతంలో ఎనిమిది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినవాడి పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  rape  gang rape  murder  Old suspect anil  bollaram  crime  

Other Articles