Christian woman stripped naked, assaulted in Pakistan

Christian woman stripped naked assaulted in pakistan

Pakistan, Christian woman, stripped, Naked, honour, Lahore, harrassment on woman, voilence on women, rape on women, gang rape on women

A 28-year-old Christian woman in Pakistan was allegedly stripped naked and assaulted by four men who barged into her house after her brother eloped with a married Muslim woman in Lahore.

క్రైస్తవ మహిళను నగ్నంగా ఊరేగించారు..

Posted: 06/28/2016 07:05 AM IST
Christian woman stripped naked assaulted in pakistan

పాకిస్థాన్‌లో ఓ ప్రేమజంట చేసిన పని.. ఓ క్రైస్తవ మహిళ మెడకు చుట్టుకుంది. క్రైస్తవ మహిళ సోదరుడు ఓ మహ్మదీయ వివాహిత స్త్రీతో పారిపోవడంతోతో అమె సోదరి పట్ల వివాహిత బంధువులు దారుణం వ్యవహరించారు. వివాహిత స్త్రీ బంధువులుగా చెప్పుకున్న బంధువులు క్రైస్తవ మహిళపై దాడి చేశారు. అమెపై సామూహిక అత్యాచారం చేయడానికి తెగబడ్డారు. అమెను నగ్నంగా మార్చి.. ఊరేగించారు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం అక్కడికి చేరుకోలేదు.

వివాహిత కూడా సదరు క్రైస్తవ యువకుడితో కలసి వెళ్లిందన్న విషయాన్ని కప్పిపుచ్చి.. కేవలం యువకుడిదే తప్పన్న దోరణిలో వ్యవహరించి.. అమె బంధువులు.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దుస్తులు ఊడదీసి.. ఆమె అత్యాచారం చేయబోయారు. ఆ దుండగుల నుంచి అతి కష్టం మీదుగా తప్పించుకున్న బాధితురాలు పొరుగింట్లోకి వెళ్లి తలదాచుకుంది. లాహోర్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే హజి పార్క్‌ తాజ్‌పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

బాధితురాలా సమ్రా సోదరుడు బాదల్ ఇటీవల ఓ ముస్లిం వివాహిత మహిళతో ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె భర్త, మరో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి సమ్రా ఇంటిపై దాడి చేశాడు. ఆమె ఇంట్లోకి చొరబడి నీ తమ్ముడు బాదల్ ఎక్కడున్నాడో చెప్పాలని అడిగాడు. తెలియదని ఆమె చెప్పడంతో ఆమెపై దాడిచేసి.. బట్టలూడదీసి సామూహిక అ‍త్యాచారయత్నం చేయబోయారు. దీంతో ఆమె వారి బారినుంచి తప్పించుకొని పక్కవాళ్ల ఇంట్లో తలదాచుకుంది. నగ్నంగా ఉన్న తనకు పొరుగింటి వారు దుస్తులు ఇచ్చారని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో నిందితుడు వసీఫ్ నసీర్ పై పోలీసులు కేసు పెట్టారు. అయితే, తాను ఫిర్యాదు చేసినా నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అతను యథేచ్ఛగా తిరుగుతూ తమను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Christian woman  stripped  Naked  honour  Lahore  Crime  

Other Articles