PM Modi snubs Swamy over fondness for publicity, calls Rajan patriot

Narendra modi condemns swamy s attack on raghuram rajan

India, RBI governor, raghuram rajan, subramanian swamy, Arun jaitley, PM Modi, new monetary policy committee, Urjit Patel, Rakesh Mohan, Subir Gokarn, Arundhati Bhattacharya

Prime Minister Narendra Modi today disapproved of party MP Subramanian Swamy's attacks on RBI Governor Raghuram Rajan and some top finance ministry officials saying they are "inappropriate".

రాజన్ ఘటికుడే.. స్వామిపై మోదీ సన్నాయి నోక్కులు..

Posted: 06/27/2016 09:09 PM IST
Narendra modi condemns swamy s attack on raghuram rajan

చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు అన్న చందం గుర్తుందిగా, సరిగ్గా అలాగే వుంది కేంద్రంలోని ప్రభుత్వం తీరు. గత కొన్నాళ్లుగా తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన పరిణామంపై అర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాను ఇక రెండో సారి కొనసాగనని స్పష్టం చేసిన తరువాత.. అ పదవికి రమారమి ఎనమిది పేర్లు పరిశీలనకు రాగా, అందులోంచి నలుగురిని షార్ట్ లిస్ట్ చేసి జాబితాను సిద్దం చేసినట్లు వార్తలు వచ్చిన తరువాత అర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఘటికుడంటూ కేంద్రం కితాబివ్వడం కోసమెరుపు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, రఘురాం రాజన్ ను చులకన చేస్తూ.. ఆయన అర్భీఐ గవర్నర్ గా దేశానికి మేలు చేయలేదని, అమెరికాకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పుకోవాలంటూ ఘాటైన విమర్శలు చేసిన తరుణంలో అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ కూడా మౌనంగా వుండిపోయారు. రెండో పర్యాయం అర్బీఐ గవర్నర్ గా పదవిని పోడగించే విషయమై ఎదురుచూసినా.. తనకు మద్దతు కరువైన నేపథ్యంలో రెండో పర్యాయం కోనసాగనని రాజన్ తేల్చిచెప్పారు,

ఇక రఘురామ్ రాజన్ అధ్యాయం ముగిసిన తరువాత ఆయన చేసిన పనులకు కితాబివ్వడం కేంద్రం వంతయ్యింది. ఎలాగు రఘురామ్ రాజన్ రెండో పర్యాయం వచ్చే అవకాశం లేదని తెలిసో, లేక అంతటి మేథావిని తాము చులకన చేసి పంపడం ఇష్టం లేకనో మొత్తానికి ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఖండించారు. రఘురాం రాజన్ తో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులపై స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని మోదీ తమ ఎంపీ వ్యాఖ్యాలపై సన్నాయి నోక్కులు నోక్కారు. ఆర్థిక రంగంలో రాజన్ అపార అనుభవమున్నవారని అన్నారు.

ఒక జాతీయ మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "ఈ తరహాలో బహిరంగ విమర్శలు చేయడం దేశానికి మంచిది కాదు. బాధ్యతతో మెలగాలి. ఎవరైనా తాను వ్యవస్థకన్నా పైనున్నానని భావిస్తే, అది వారి స్వీయ తప్పిదమే అవుతుంది" అని అన్నారు. స్వామి పేరును ప్రస్తావించకుండానే ఆయన మెత్తగా మొట్టారు. తన సూచన చాలా స్పష్టమని, ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని మోదీ అన్నారు. రాజన్ దేశభక్తిపై తనకు ఎలాంటి సందేహమూ లేదని పేర్కోన్నారు.

రాజన్ కు ఒక పదవి ఉన్నా లేకున్నా తన దేశానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటారని తనకు తెలుసునని అన్నారు. ఆయన మంచి వ్యక్తని తనకు తెలుసునని, ఆర్బీఐ గవర్నరుగా తన విధిని ఆయన సక్రమంగా నిర్వర్తించారని పొగిడారు. రాజన్ తన పదవీకాలం పూర్తయ్యేంత వరకూ పదవిలో కొనసాగుతారా? అని ప్రశ్నించగా, ఆయన తన కాలపరిమితిని పూర్తి చేసుకునేంత వరకూ పదవిలో ఉంటారనడంలో సందేహం లేదన్నారు. ఆయన యూపీఏ హయాంలో వచ్చారు కాబట్టి, తానేదో అడ్డుకుంటున్నాననడం పూర్తి అవాస్తవమని అన్నారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  RBI governor  raghuram rajan  subramanian swamy  Arun jaitley  PM Modi  

Other Articles