అగ్రరాజ్యం అమెరికా 131 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఒక మహిళ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలను చేపట్టనుందా..? ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ పదవీ బాధ్యతలను అందుకోనుందా..? అమెరికా చరిత్రలో క్లింటన్ రెండు దఫాలుగా అమెరికా అధ్యక్షుడిగా చేయగా, పస్ట్ లేడీగా వున్న అమె అ తరువాత కేవలం పదేళ్లలో అధ్యక్షరాలి స్తాయికి ఎదిగి.. రిపబ్లికన్ పారటీ అభ్యర్థి, ప్రముఖ వాణిజ్యవేత్త డోనాల్డ్ ట్రంప్ కు చుక్కలు చూపిస్తూ.. పగ్గాలు చేపట్టనుందా..? అంటే అవుననే సమాధానాలే అధికంగా వినబడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారో తెలిసిపోయింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో తన సహజ నైజాన్ని చాటుకుంటూ ముందుగా అంచనాలను తారుమారు చేసి రేసులో ముందుకు దూసుకెళ్లిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. ఆ తరువాత తొలిసారిగా అమెరికా చరిత్రలో తనకంటూ ఒక నూతన అధ్యయాన్ని రచించుకుంటూ అగ్రరాజ్య ఉన్నత పదవికి బరిలో నిలిచిన మహిళ హిల్లరీ క్లింటన్. ఇక ఇద్దరిలో ఎవరిది పైచేయి అనే విషయం తేలేందుకు మాత్రం మరికోన్ని నెలలు అగాల్సిందే.
అయితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయి అని నిర్ణయించడానికి చేసిన సర్వేలలో.. డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌దే పైచేయి అని తేలింది. వాషింగ్టన్ పోస్ట్ - ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీకి.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే 12 పాయింట్ల ఆధిక్యం కనపడింది. ఈరోజుకు ఈరోజే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. తాము హిల్లరీకి ఓటేస్తామని 51 శాతం మంది చెప్పగా, ట్రంప్ తరఫున ఉన్నవాళ్లు 39 శాతం మందేనని తేలింది.
ఇక వాల్‌స్ట్రీట్ జర్నల్ - ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన పోల్‌లో ఇంత ఎక్కువ తేడా లేకపోయినా, అక్కడ కూడా హిల్లరీ క్లింటన్కే ఆధిక్యం దక్కింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 41 శాతం మంది మద్దతు కనిపించింది. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే మాత్రం.. వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ఆయన తన పార్టీ ప్రచార మేనేజర్‌ను కూడా తొలగించారు. నిధుల సేకరణలో కూడా ట్రంప్ కంటే హిల్లరీ చాలా ముందున్నారు.
ఆర్లాండోలోని గే నైట్ క్లబ్బులో కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా పలువురికి అసంతృప్తి కలిగించింది. ముస్లింలు అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని కూడా ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ట్రంప్ ఇలాంటి తప్పులు చాలా చేశారని, గత కొన్నివారాలుగా ఇలా చేయడం వల్లే వెనకబడ్డారని రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్ కానెల్ అన్నారు. అయితే ఇంకా నవంబర్ వరకు చాలా సమయం ఉందని, అప్పటికి పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more