swamy swaroopa nandendra targets chandrababu government on tirumala

Subramanian swamy opposes ap govt s control of tirumala

BJP Rajya Sabha Member, MP Subramanian Swamy. sharadha peetam, swamy swaroopa nandendra. Andhra Pradesh state Government, subramanian swamy Sensational comments on Tirupati. tirimala under government Controlm NDA, Chandrababau, PM Modi, Narendra Modi, Tirimala Temple, TTD in Govt Control, TTD under Govt Control

BJP Rajya Sabha Member Subramanian Swamy Targets Andhra Pradesh state Government with Sensational comments on Tirupati under its Control

చంద్రబాబు సర్కార్ ను టార్గెట్ చేసిన మిత్రపక్ష నేత

Posted: 06/25/2016 07:51 PM IST
Subramanian swamy opposes ap govt s control of tirumala

బీజేపి పార్టీ నుంచి రాజ్యసభకు సభ్యత్వం లభించిన నాటి నుంచి రోజుకో వివాదాస్పదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఆయన. విపక్ష పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలపై వరుస దాడులు కొనసాగిస్తున్న ఆయన ఈ సారి తమ మిత్రపక్షమైన టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు, ఆయన మరోవరో కాదు బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని ఆయన నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తాము మిత్రపక్షంగా కొనసాగుతున్నా.. సుబ్రహ్మణ్యస్వామి తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించడం సబబుకాదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి తిరుమల అంశంపై దేశసర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టే ముందు.. తమిళనాడులోని పలు పవిత్ర పుణ్యక్షేత్రాలపై ముందుగా న్యాయస్థానాన్ని అశ్రయించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు.

కాగా, కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి దేవాల‌య భూముల‌పై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెత్తనం చలాయిస్తున్నాయని శార‌దా పీఠాధిప‌తి స్వామీ స్వ‌రూపానందేంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేవాల‌యాల భూముల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడ‌నాడాల‌ని అన్నారు. శ్రీ‌వారి ఆల‌యంపై ప్ర‌భుత్వ పెత్త‌నం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేవాల‌య భూముల‌ను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బీజేపీ ఆగ‌డాల‌కు క‌ళ్లెంవేయాల్సిన అవసరం ఉందన్నారు. దేవాల‌య భూముల‌ను ర‌క్షించుకునే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని వ్యాఖ్యానించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles