షర్మిలా తర్వాత లోకేష్ బాబు? | nara lokesh interact with telanaga TDP leaders

Nara lokesh interact with telanaga tdp leaders

nara lokesh, TTDP, sharmila, nara lokesh interact with telanaga TDP leaders, తెలంగాణలో నారాలోకేష్, టీటీడీపీతో నారాలోకేష్, నారాలోకేష్ తెలంగాణ బాధ్యతలు, తెలంగాణ రాజకీయాలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, షర్మిలా నారాలోకేష్, రాజకీయాలు, latest news, telangana news, telugu news

nara lokesh interact with telanaga TDP leaders for damage control. ignoring senior suggestions like sharmila.

షర్మిలా తర్వాత లోకేష్ బాబు?

Posted: 06/18/2016 05:28 PM IST
Nara lokesh interact with telanaga tdp leaders

ఒకరు వైఎస్సార్పీపీ, మరోకరు టీడీపీ... ఎక్కడా పొసగదు. మరి ఇద్దరికి ఎక్కడ పొంతన ఉందా అని అనుకుంటున్నారా? తెలంగాణలో తూట్లు పడుతున్న సమయంలో పార్టీని బతికించుకునేందుకు తన సొదరి షర్మిలాకు పగ్గాలు అప్పజెప్పి, వరుస ఓదార్పు యాత్రలు చేయించాడు వైఎస్సార్సీపీ అదినేత జగన్. అయితే ఆ సమయంలో ఇక్కడి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే ఆమె పర్యటన కొనసాగించింది. పోనీ నేతల అభిప్రాయాలు తీసుకుందా అంటే, ఆ విషయంలో అన్ననే మించిపోయిందని చెప్పుకున్నారు కూడా. ఫైనల్ గా  జగన్ విడిచిన ఈ బాణం సక్సెస్ కాకపోగా, పార్టీకి ఒరగబెట్టింది కూడా ఏంలేదు. ఆపై పార్టీ విధానాలు నచ్చకో లేక అధినేతతో ఇబ్బందులో తెలీదుగానీ, మొత్తానికి అందులో ఇమడలేక ఆమె పార్టీ నుంచి దూరమయ్యారు. ఇక ఇప్పుడు సేమ్ అలాగే టీడీపీకి జరిగిన డ్యామేజ్ ను రిపేర్ చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు చినబాబు నారా లోకేష్.

తెలంగాణ టీడీపీని బతికించుకునేందుకు, పార్టీని పున:ప్రతిష్టించుకునేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్ మరో అడుగు మందుకు వేశాడు.. గత వారం ఇచ్చిన హామీ మేరకు శనివారం ఆయన టీ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సీనియర్ నేతలతోసహా పలువురు ముఖ్యనేతలు హజరయ్యారు. టీ టీడీపీ చీఫ్ ఎల్. రమణ, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణలో పార్టీ బలోపేతం, అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఎదురొడ్డి పోరాడే విషయాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ఇచ్చిన సూచనలపైనే నేతలంతా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అంతర్గత వ్యవస్థ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే లోకేష్ సూచనలు చేయటంపై సీనియర్లు అసంతృప్తితో వ్యక్తం చేశారంట. ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించడమో లేక కనీసం స్థానిక నేతలను రప్పించుకుని వారిచ్చే నివేదికల ఆధారంగా పరిస్థితులను అధ్యయనం చేయడమో లాంటివి చేస్తే మంచిదని వారు సూచించారంట. అయినా ఇవేం పట్టించుకోని లోకేష్ మాత్రం తూతూ మంత్రంగా సమావేశాన్ని ముగించేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  TTDP  sharmila  

Other Articles