మత్తు ఉచ్చులో మమత? | Police To Issue Red-Corner Notice Against Mamta Kulkarni

Police to issue red corner notice against mamta kulkarni

Mamta Kulkarni, drugs rocket, bollywood actress, బాలీవుడ్ నటి మమత కులకర్ణి, డ్రగ్స్ కేసు, మమత కులకర్ణి మాదక ద్రవ్యాల వ్యవహారం, తెలుగు వార్తలు, బాలీవుడ్, విక్కీ గోస్వామి, తెలుగు వార్తలు, డ్రగ్స్ కేసులో నటి హస్తం, latest news, bollywood news

Police To Issue Red-Corner Notice Against Mamta Kulkarni

మత్తు ఉచ్చులో మమత?

Posted: 06/18/2016 04:36 PM IST
Police to issue red corner notice against mamta kulkarni

డ్రగ్స్ కేసుతో తనకేం సంబంధం లేదంటున్న బాలీవుడ్ నటి మమత కులకర్ణి అమాయకురాలేం కాదని పోలీసులు చెబుతున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో ఆమెపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కెన్యా ప్రధానంగా ఉన్న ఈ రాకెట్ దందా మూలాలను ముంబై లోని థానేలో పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మమతతోపాటు ఆమె భర్త, అంతర్జాతీయ స్మగ్లర్ విక్కీ గోస్వామిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ కేసుకు తనకు ఎలాటి సంబంధంలేదని మమత వాదిస్తోంది. విక్కీ అయితే ఏకంగా మమత అసలు తన భార్య కాదని చెప్పుకొచ్చాడు. కానీ, మమత కూడా నిందితురాలేనని, మొత్తం వ్యవహారం అంతా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు అంటున్నారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తు పురోగతిని మీడియాకు వెల్లడించారు. ఆమె పాత్రకు సంబంధించిన ఆధారాలు దొరికాయని, నిందితుల జాబితాలో ఆమె పేరును కూడా చేర్చుతున్నట్లు పరంవీర్ చెప్పారు.

మమతపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ ను కోరతామని, అలాగే మమత, గోస్వామి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని ఆయన తెలిపారు. కాగా, 90 వదశకంలో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈ నటి ఇలా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం కలకలాన్నే రేపింది. ఈ వ్యవహారంలో మరికొందరు బాలీవుడ్ సెట్రిటీలు కూడా ఉన్నారని చెబుతున్న పోలీసులు వారి పేర్లను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamta Kulkarni  drugs rocket  bollywood actress  

Other Articles