Hillary Clinton says Donald Trump 'fixated' over the term 'radical Islam'

Donald trump s bluster about radical islam helps radical islam

Donald Trump, Barack Obama, Radical Islam, Orlando Shooting, Terrorism, Hillary Clinton, Use of terms like 'radical Islam' would make big difference: Donald Trump

After Barack Obama criticised trump for using the term "radical Islam", he vehemently defended his stand arguing that the phraseology makes a "big difference" in the war against terrorism.

డోనాల్డ్ ట్రంప్ వాదనలు.. మూడుకాళ్ల కుందేలే..

Posted: 06/16/2016 05:58 PM IST
Donald trump s bluster about radical islam helps radical islam

రిపబ్లికన్ పార్టీ తరపున అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లపై నిప్పులు చెరిగారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో బలమైన వితండవాదానికి తెరలేపుతున్న డోనాల్డ్ ట్రంప్.. తాజాగా అమెరికాలో జరిగిన ఆర్లెండో నైట్ క్లబ్ మారణహోమాన్ని కూడా తన ప్రచారాస్త్రంగా మార్చుకుని దానిపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను బలంగా సమర్థించుకుంటున్నారు.

అంతేకాదు తన ప్రత్యర్థి క్లింటన్ సహా అధ్యక్షుడు ఒబామా తన వ్యాఖ్యలను తప్పబట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అర్లెండోలో జరిగిన నరమేధాన్ని ఒబామా తీవ్రంగా వ్యతిరేకించలేదని విమర్శించిన ట్రంప్.. 'రాడికల్ ఇస్లాం' అనే పదం వాడటంలో చాలా వ్యత్యాసమే ఉందని పేర్కొన్నారు. టెర్రరిస్టులపై యుద్ధాన్ని ప్రకటించడంలో భాగంగా ఇలాంటి పదాలను వాడటం సరైన చర్యగా చెప్పుకొచ్చారు. అసలు సమస్య ఏంటన్నదే ఒబామాకు తెలియదని చెప్పుకోచ్చాడు.

దీంతో పాటు ప్రస్తుతం ప్రపంచంలో ఏ రకమైన ఉగ్రవాదం ఉంది ?, దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న విషయాలపై చర్చించనంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడికి దానిపై అవగాహనా రాదంటూ మండిపడ్డారు. సమస్యలే తెలియనప్పుడు వాటిపై తగిన చర్యలు తీసుకునే స్థాయిలో ఒబామా లేరని విమర్శించారు. అట్లాంటాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. రాజకీయంగా కరెక్ట్ అని చెప్పుకోవాలనుకుంటున్న ఒబామా, ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవడం విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి అయినా 'రాడికల్ ఇస్లాం' అనే పదం ఎందుకు వాడకూడదో తెలుసా లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత నాయకులు బలహీనులు కావడం, ఉగ్రవాదంపై నియంత్రణ చర్యలు తీసుకోలేని కారణంగానే ఒర్లాండో దాడి జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాను ముందే చెప్పినా అధ్యక్షుడు ఒబామా పట్టించుకోలేదని వివరించారు. ఒబామా చెప్పిన విషయాలను హిల్లరీ గుడ్డిగా ఫాలో అవుతున్నారని, ఆమెకంటూ సరైన విధానాలు లేవని డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Orlando shooting  Donald Trump  Barack Obama  Hillary Clinton  Radical Islam  Terrorism  

Other Articles