andhra pradesh police over action in arrest of mudragada

Ap police beats mudragada son on his arrest

mudragada hunger strike, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR, pawan kalyan

AP police overaction in arrest of Kapu caste leader Mudragada padmanbham, police beats mudragada son and pushes him out of his home

ITEMVIDEOS:ముద్రగడ అరెస్టులో పోలీసుల ఓవరాక్షన్.. తనయుడినీ తరమికోట్టారు..

Posted: 06/10/2016 12:52 PM IST
Ap police beats mudragada son on his arrest

నేరాల అదుపులో అంతా అయ్యాక దర్యాప్తు చేసే నిందితులను పట్టుకుని వివరాలు వెల్లడించే పోలీసులు నేరాలను ముందస్తుగా అదుపు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. అయితే కాపు గర్జన సందర్భంగా తునిలో నిజంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం పోలీసులు విధులను నిర్వహించి వుంటూ రత్నాచల్ రైలు దహనకాండ జరిగేదే కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తమ జాతికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తూ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ కు పాల్పడ్డారు.

ముద్రగడ పద్మనాభం అమరణ దీక్షను భగ్నం చేసి.. అంబులెన్సులో అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు ముద్రగడ తనయుడిని కూడా వదల్లేదు. తన మానాన తాను బయటకు వెళ్తున్న వ్యక్తిని ఒక పోలీసుల వచ్చి వెనకనుంచి లాఠీతో చాచి కోట్టాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానన్ని ప్రశ్నించబోయిన ముద్రగడ తనయుడికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోగా, అ వెంటనే ఇతర పోలీసులు అయను అడ్డుకుని బయటకు పంపారు. ఈ క్రమంలో మరోమారు ఇంకో పోలీసు ముద్రగడ వీపుపై చాచి కోట్టాడు.


తన ఇంటి నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని పోలీసులు ఎందుకు కోట్టారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ముద్రగడ పద్మనాభం పైనున్న కోపాన్ని పోలీసులు ఇలా ఆయన తనయుడిపై చూపుతున్నారా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. లేక ఎవరైనా ముందస్తుగా ఇచ్చిన అదేశంతోనే ముద్రగడ తనయుడిని లాఠీలతో కోట్టారా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆయన తనయుడిపై పోలీసులు లాఠీ ఝళిపిస్తున్న తాజా దృశ్యాలు వెలుగులోకి  రావడంతో అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  police over action  mudragada son  arrest  kirlampudi  kapu stir  

Other Articles