rajnikanth undergoing treatment in america

Kabali audio to launch online as rajnikanth is ill

Rajnikanth, south indian superstar, illness, american hospital, treatment, kollywood news, tollywood news, telugu news

If sources are to be belived, south indian super star rajnikanth has fall ill, and is undergoing treatment in american hospital

సూపర్ స్టార్ రజనీకాంత్ కు అనారోగ్యం..?

Posted: 06/10/2016 11:42 AM IST
Kabali audio to launch online as rajnikanth is ill

దక్షిణాధి సూపర్ స్టార్ అయినప్పటికీ యావత్ దేశవ్యాప్తంగా అభిమానులను కల్గిన రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా..? అందుకనే కబాలి చిత్రం అడియో విడుదలలో జాప్యం జరుగుతుందా..? అసలు అయనకేం జరిగింది..? ఇప్పుడెలా వుంది..? అన్న వార్తలు ఇప్పడాయన అభిమానులలో తలెత్తుతున్నాయి. రజనీకాంత్ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారన్న వార్తా కథనాలు వెల్లువెత్తుతుండటంతో అభిమానులు అందోళనకు గురవుతున్నారు. రజనీకాంత్ కు ఏమైందన్న విషయం తెలియక వారు కలవరానికి గురవుతున్నారు.

రజనీకాంత్ హీరోగా తాజాగా రూపోందించిన ‘కబాలీ’ చిత్రం టీజర్ పెను సంచలనాలను సృష్టించింది. విడుదలకు ముందే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. ఈ చిత్రం టీజర్ ను యూట్యాబ్ లో అత్యధికంగా వీక్షించిన రికార్డును కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఏర్పాట్లు చేసుకున్నారు. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఉన్నపళంగా సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన ధాను... ఆడియో రిలీజ్ ను కేవలం ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రకు వెళ్లిన రజనీ అనారోగ్యానికి గురయ్యారని, అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. రజనీకి అనారోగ్యం కారణంగానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆన్ లైన్ లో నిర్వహించేందుకు నిర్మాత సన్నద్ధమయ్యారని ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే రజనీకి అనారోగ్యమంటూ వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కూడా మరికొన్ని కథనాలు చెబుతున్నాయి.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles