Bollywood actor Emraan Hashmi's co-star Alisa Khan living on streets?

Bollywood actress alisa khan living on streets

Alisa Khan, Alia Khan on streets, Bollywood Actor, Emraan Hashmi, Bollywood star, My husbands wife,

Disturbing but true, Bollywood actor Emraan Hashmi's co-star in a film that has not been released yet-- Alisa Khan was found living on the streets of Greater Kailash

బాలీవుడ్ నటినీ వదలని ఆ వీడియోలు.. ఇబ్బందులు

Posted: 06/10/2016 09:55 AM IST
Bollywood actress alisa khan living on streets

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ జోడీగా ఇంకా విడుదల కానీ చిత్రంలో నటించిన అలిసా ఖాన్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అలిసా, ఇమ్రాన్ జోడీగా 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో కలిసి నటించారు. అయితే ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. కాగా అలిసా ఖాన్ యుక్త వయస్సులో చేసిన తప్పులే అమెను ప్రస్తుతం కష్టాల్లోకి నెడుతున్నాయి. దీంతో అమె దేశ రాజధాని వీదులలో జీవనం సాగిస్తోందని ఓ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.  ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ వీదిలో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటోందని కథనంలో పేర్కోన్నారు.

వాస్తవానికి ఆమె తన ఫ్యామిలితో సహా ఘజియాబాద్ లో ఉండేవారు. అయితే 2010లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో నటించింది. అయితే ఆ చిత్రం సాంకేతిక పరమైన కారణాలో లేక ఆర్థికపరమైన కారణాల వ్లలనో ఇప్పటివరకూ ఆ మూవీ విడుదల కాలేదు. కాగా అమెకు అప్పట్లో ఓ వ్యక్తితో పరిచమయై అది కలిసి తిరిగే వరకు వెళ్లింది. ఈ క్రమంలో అలిసా ఖాన్ కూడా సాధారణమైన యువతిలా అతని మాజీ బాయ్ ఫ్రెండ్ వ్యామోహంలో పడి.. చాలా దూరం వెళ్లింది. అయితే వారిద్దరూ సన్నిహితంగా వున్న వీడియోలు వెలుగు చూశాయి.

దీంతో అలిసా తీరు, చేష్టలు నచ్చక ఇంట్లో వాళ్లు ఆమెను బయటకు గెంటివేశారని, ఇక చేసేది లేక అమె ఢిల్లీ విధుల్లో బతుకీడుస్తుందన్న కథనం వెలువడింది. దీంతో అలిసా ఖాన్ తన మాజీ లవర్ ఈ విషయాలను ఓ వీడియో రూపంలో లీక్ చేశాడన్న సమాచారం అందింది. దీంతో మాజీ బాయ్ ఫ్రెండ్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమె పోలీసులను ఆశ్రయించింది. అతడు లీక్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారం వల్లే తన ఇంట్లోనే స్థానం కోల్పోయానని అలిసా చెప్పుకొచ్చింది. చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఆ నటి నగర వీదుల్లో జీవనం సాగిస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  actress  alisa khan  leaked videos  Emraan Hashmi  

Other Articles