Violent attack on Raghavendra Rao's house

Attack on director k raghavendra rao

k raghavendra rao house attack hyderabad ramadasu story issue, tollywood news, telugu news

A violent attack that took place on Raghavendra Rao's house on Thursday has just come to light.

ప్రముఖ తెలుగు దర్శకుడిపై అనంత యువకుడి దాడి

Posted: 06/10/2016 07:17 AM IST
Attack on director k raghavendra rao

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుపై ఓ యువకుడు దాడికి ప్రయత్నించాడు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో రాఘవేంద్రరావు నివాసం ఉంది. అక్కడికి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడకు చెందిన వల్లిపి రవీంద్ర అనే యువకుడు నానా బీభత్సం సృష్టించాడు. కారులో బయటికి వెళ్తున్న రాఘవేంద్రరావును తిడుతూ అడ్డుపడ్డాడు. వాచ్ మెన్ వచ్చి అడ్డుకున్నా... అతడిని తోసేసి మరీ దర్శకేంద్రుడి వైపు దూసుకెళ్లి, కారులోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. 2006లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ చిత్ర మూల కథ తనదేనని చెప్పుకున్న సదరు యువకుడు... ఇప్పటిదాకా దానికి సంబంధించి రెమ్యూనరేషన్ తనకు అందలేదని చెప్పుకోచ్చాడు.

శ్రీరామదాసు కథ తనదని, ఆ కథను 2003లో పంపించానని, తెరపై తన పేరు వేయకుండా వేరే వాళ్ల పేర్లు ఎలా వేస్తావంటూ రాఘవేంద్రారావుపై విరుచుకుపడ్డాడు. రాఘవేంద్రరావు అతడిని పట్టించుకోకుండా కారులో వెళ్లిపోయారు. యువకుడు చేతికి దొరికిన రాడ్ తో ఇంట్లో ఉన్న మూడు కార్లను, ఇంటి అద్దాలను పగులగొట్టాడు. దర్శకేంద్రుడి కొడుకు ప్రకాశ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ప్రకాశ్, వాచ్ మెన్ యువకుడిని ఈడ్చుకెళ్లి ఓ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రవీంద్రను అరెస్టు చేసి తీసుకెళ్లారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles