Philippine's Rodrigo Duterte urges public to kill drug dealers

Philippines punisher tells public to kill drug dealers

rodrigo duterte, philippines, philippines president elect, philippines crime, rodrigo duterte drug dealers, drug dealers in philippines, world news

Philippine president-elect encouraged the public to help him in his war against crime and urged citizens with guns to shoot and kill drug dealers who would resist arrest and fight back in their neighborhoods.

కనిపిస్తే కాల్చిపారేయండీ.. ప్రజల చేతికి పశుపతాస్త్రం..

Posted: 06/06/2016 02:58 PM IST
Philippines punisher tells public to kill drug dealers

మత్తు వదలారా.. నిద్దుర మత్తు వదలరా.. మత్తులో వుంటే గమ్మత్తుగ చిత్తవుదురా.. అంటూ ఆంధ్రుల అరాధ్యుడు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పాడిన పాటను విన్నారో ఏమో తెలియదు కానీ అక్కడి అధ్యక్షుడు ప్రజలకు ఏకంగా ఓ పశుపతాస్త్రాన్ని అందించాడు. ఇకపై ఆ దేశంలో మత్తులో జోగేవారు కనిపించకుండా, అసలు మత్తు పదార్థాలను తమ దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చి విక్రయించే వారి సంఖ్య కూడా ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో గణనీయంగా తగ్గనుంది.

నమ్మశక్యంగా లేదా..? మత్తుపధార్థాలను వదులుకునే స్థాయిలో అ దేశ అధ్యక్షుడు ప్రజలకిచ్చిన అస్త్రమేంటి అని సందేహాలు వద్దు.. ఎందుకంటే అది చాలా పవర్ ఫుల్. మన దేశంలో అప్పడప్పుడు దొంగలు పేట్రేగిపోతూ వరుస దోంగతనాలకు పాల్పడుతుంటే.. దోంగలను కొట్టండి.. లేదా చంపండీ.. మీ పైన ఎలాంటి కేసులు వుండవు అంటూ ఇచ్చే ప్రకటన మాదిరిగానే అక్కడి అధ్యక్షుడు కూడా అలాంటి ప్రకటనే చేశాడు. డ్రగ్ డీలర్స్ను కాల్చి పారేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మత్తు పదార్థాల దొంగ రవాణాపై చర్యలు తీసుకునే విషయాన్ని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టీ అన్నారు, మత్తుపదార్థాలు నచ్చిన తాను వీర అభిమానినంటూ వ్యాఖ్యానించారు. ఏ డ్రగ్ డీలర్ అరెస్టుకు సహకరించకుండా వ్యతిరేకిస్తాడో అతడిని ప్రజలే కాల్చిపారేయాలని, లేదంటే కొట్టి చంపేయాలని ఆయన బహిరంగా వ్యాఖ్యాలు చేశారు. తొలిసారి ప్రజా సమూహం మధ్య మీడియా కవరేజ్ లో మాట్లాడిన ఆయన డ్రగ్స్ కట్టడిలో తనకు ప్రజలంతా సహకరించాలని డిమాండ్ చేశారు.

డ్రగ్స్ విషయంలో అందరూ స్వేచ్ఛంగా ఆలోచించాలన్నారు. వారి సమాచారం తెలిస్తే పాలకులకు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలని, లేని పక్షంలో వారిని మీరే కాల్చి చంపండీ.. డ్రగ్ డీలర్లను చంపినవారికి తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మాఫియాను తేలికగా తీసుకుంటే అది ఫిలిప్పీన్స్ను ఆక్రమిస్తుందన్నారు. డ్రగ్స్ ను నియంత్రించిన పక్షంలో నేరాలు కూడా తగ్గుతాయని, ఇక అవినీతి కూడా అరు మాసాల్లో తగ్గుముఖం పడుతుందన్నారు. డ్రగ్స్లోనే అలావాటు వున్నవారిని కూడా తాను చంపుతానన్నారు. దీనిని ఉత్తిగా తీసుకోకూడదని, మత్తుపదార్థాలను తీవ్రంగా భావించి ఈ హెచ్చరికలు చేస్తున్నానని రోడ్రిగో డ్యూటర్టీ అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippine president  Rodrigo Duterte  drugs  

Other Articles