పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ | No TDS for PF withdrawals of up to Rs 50000

No tds for pf withdrawals of up to rs 50000

PF withdrawals, No TDS, Rs 30,000 to Rs 50,000 withdrawl, ఫీఎఫ్ విత్ డ్రా, పన్నుకోత, latest news, buiness news

the government has decided no tax would be deducted at source for PF withdrawals of up to Rs 50,000 from June 1. The threshold limit has been extended from Rs 30,000 to Rs 50,000 of PF withdrawal for TDS. "The Finance Act , 2016 has amended section 192A of Income Tax Act, 1961 to raise the threshold limit of PF withdrawal from Rs 30,000 to Rs 50,000 for Tax Deducted at Source (TDS)," the notification stated.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Posted: 05/31/2016 10:38 AM IST
No tds for pf withdrawals of up to rs 50000

జూన్ 1 నుంచి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్ ) లో కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. పీఎఫ్‌ నుంచి ఖాతాదారులు ఎలాంటి పన్ను కోత(టీడీఎస్) లేకుండానే రూ. 50 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో టీడీఎస్ లేకుండా 30వేల వరకు విత్ డ్రా చేసుకునే వెసులు బాటు మాత్రమే ఉండేది. ఉద్యోగులు ముందస్థుగా పీఎఫ్‌లోని నగదును విత్‌డ్రా చేయకుండా ఉండేందుకే ఈ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. తద్వారా రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం చేతికి వచ్చేలా ఉండేందుకు పీఎఫ్‌ విత్‌డ్రాలపై సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

అలాగే పీఎఫ్‌లో ఉన్న మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేస్తే పన్ను విధించరు. ఉద్యోగులు ఐదేళ్ల తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేసినా పన్ను విధించకూడదని కొత్త చట్టం చెబుతోంది. ఇందుకోసం సభ్యులు 15జి లేదా 15హెచ్‌ ఫారం సమర్పిస్తే ఈ పన్ను ఉండదు. ఈ మొత్తం అందుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయపన్ను పరిమితి లోపలే ఉంటుందని ఆయా ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో 15జి 60 ఏళ్ల లోపువారికి, 15హెచ్ 60 ఏళ్లు దాటినవారికి వర్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PF withdrawals  No TDS  Rs 30  000 to Rs 50  000 withdrawl  

Other Articles