Drone Flying Over Airport Delays 55 Flights In Southwest China

Drone delays 55 flights at busy china airport

Drone in China,Chengdu Shuangliu Airport,Drone delays flights, drone, delay, flights, china,

Drone in China,Chengdu Shuangliu Airport,Drone delays flights, drone, delay, flights, china,

55 చైనా విమానాలను ఆ చిన్నది అపేసింది..

Posted: 05/29/2016 12:02 PM IST
Drone delays 55 flights at busy china airport

ఒక్కోసారి అకతాయిలు చేసే పనులు అందరినీ కంగారు పెట్టిస్తాయి. ఎంతలా అంటే వాటి పరిణామాలు ఎంత వరకు దారితీస్తాయో కూడా తెలియని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇటీవల బ్రీటీష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక చిన్నపాటి డ్రోన్ దానిని ఢీకొన్నింది. దీనిపై వారు వెంటనే సదరు విమానాశ్రాయ అధికారులకు కూడా పిర్యాదు చేశారు. అచ్చం అలాగే ఇక్కడ కూడా జరిగింది. అయితే డ్రోన్ అపరేట్ చేస్తున్న విషయాన్ని కనిపెట్టి అదికారులు దానిని ఎవరు అపరేట్ చేస్తున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తును ప్రారంభించారు. చైనాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంలో అధికారులు ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న చెంగ్డూ షాంగ్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉన్న అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం మీదుగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియని ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న 55 విమానాలను కొంత సమయం పాటు అలాగే నిలిపేశారు. ప్రమాదమేమీ లేదని నిర్థారించుకున్న తరువాత విమానాలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరాయి. ఆ డ్రోన్కు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఓ డ్రోన్ మూలంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగటం ఇదే తొలిసారని అంటున్నారు. అయితే విమానాశ్రయం మీదుగా ఎలాంటి డ్రోన్లు నడపరాదన్న అంక్షలను కాదని వాటిని ఎగురవేసిన వారెవన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drone in China  Chengdu Shuangliu Airport  Drone delays flights  drone  delay  flights  china  

Other Articles